భారత క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ ఎంతటి నాణ్యమైన ఆటగాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందిస్తూ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రోహిత్ కెరియర్ మొదట్లో అంతగా ఆకట్టుకోకపోయినా తన ఆటను మెరుగు పరుచుకుంటూ క్రమేపీ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఎటువంటి బాల్ అయినా ఎంతటి బౌలర్ అయినా ఒక్కసారి రోహిత్ చెలరేగాడు అంటే బౌండరీల మోత మోగల్సిందే.

అందుకే అభిమానులు హిట్ మ్యాన్ అంటూ పిలుస్తారు. అయితే ఆస్ట్రేలియా జట్టుతో మ్యాచ్ అనగానే రోహిత్ మరింత కసిగా ఆడుతూ ఆసీస్ జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు. రోహిత్ వన్డే లలో నెలకొల్పిన మూడు డబుల్ సెంచరీ రికార్డుల్లో రెండు ఆసిస్ జట్టు పైనే సాధించాడు. ఫార్మాట్ ఏదైనా రోహిత్ తనదైన శైలిలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా హిట్ మ్యాన్ సొంతం. అయితే రోహిత్ కెరియర్ లో ఒక చెత్త రికార్డు నమోదయింది.

టెస్టు ఫార్మాట్‌లో ...ఒకే బౌలర్‌ చేతిలో ఆరుసార్లు పెవిలియన్‌ చేరి ఈ చెత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. మొదటి రెండు టెస్టులకు అందుబాటులో లేని రోహిత్ మూడవ టెస్ట్ నుండి అందుబాటులోకి వచ్చాడు. ప్రస్తుతం నిలకడగానే రాణిస్తున్న రోహిత్.. కంగారూ స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ చేతిలో...ఇప్పటి వరకు ఆరుసార్లు ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు నాథన్‌ లయన్‌ దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడతో సమానంగా ఉన్నాడు. అయితే చివరి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపడంతో...ఆస్ట్రేలియా స్పిన్నర్‌ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ లాంటి అత్యుత్తమ బ్యాట్స్మెన్ పై ఇలాంటి రికార్డు నమోదు చేయడం విశేషం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: