బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. తమ సొంతగడ్డపైనే ప్రత్యర్థి జుట్టును మట్టి కరిపించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. టీమిండియా లో కీలక ఆటగాళ్లు అందరూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న సందర్భంలో కుర్రాళ్ళు ముందుండి నడిపించి భారత్ ఘన విజయాన్ని కట్టబెట్టారు.

దీంతో భారత్ చాలా రోజుల తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి కి చేరుకుంది. భారత్ చిరస్మరణీయ విజయం సాధించడంతో పలువురు ప్రముఖులు టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోడీ మొదలుకొని సచిన్ వరకు ట్విట్టర్ వేదికగా అందరూ కూడా కుర్రాళ్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శన మెచ్చుకుంటూ తమ అభినందనలు తెలుపుతున్నారు. దీంతో టీమిండియా హాష్‌టాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మ్యాచ్‌ ముగిసిన పది నిమిషాల్లోపు లక్షల్లో ట్వీట్లు, రీ ట్వీట్లతో ట్విటర్‌లో మోత మోగింది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ..   "భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్‌ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని" ట్వీట్ చేశారు.క్రికెట్‌ దిగ్గజం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్‌ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్‌ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్‌ ట్వీట్‌ చేశారు. ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్‌ కోహ్లి, వీవీఎస్‌ లక్క్ష్మణ్‌, శిఖర్‌ ధావన్‌, ఇశాంత్‌ శర్మ తదితరులు ట్విటర్‌ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. ఇంకా రాష్ట్రపతి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ వంటి వారు ట్విట్టర్ వేదికగా భారత జట్టుకు అభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: