ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా సత్తా చాటింది అనే విషయం తెలిసిందే. ముందుగా టి20, వన్డే సిరీస్ లలో  ఎలా ఆడినప్పటికీ టెస్టు సిరీస్ మాత్రం మొదటిసారి ప్రేక్షకుల అందరిలో ఉత్కంఠ కలిగించింది.  అయితే మొదట ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు సిరీస్ ఆడిన భారత జట్టు...  మొదటి మ్యాచ్ లో  ఓటమి పాలు అయింది అన్న విషయం తెలిసిందే.  మొదటి మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ లాంటి కీలక ఆటగాడు జట్టు నుంచి వెళ్లిపోవడంతో గెలవడం అసాధ్యం అని అనుకున్నారు.



 కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అద్భుతమైన పోరాటపటిమ తో రెండో మ్యాచ్ నుంచి టీమిండియా ఎంతో అద్భుతంగా రాణించి అన్న విషయం తెలిసిందే.  జట్టులో  ఉన్న మరికొంతమంది కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్నప్పటికీ కూడా వెనకడుగు వేయలేదు టీమిండియా. ముఖ్యంగా టీమిండియా విజయంలో యువ ఆటగాళ్లు ఎంతో కీలక పాత్ర వహించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మొన్నటివరకు జట్టులో స్థానం ఇవ్వడమే వేస్ట్ అనుకున్న వాళ్ల నోళ్లు ముగిస్తూ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు.



 ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా గడ్డపై 2- 1 తేడాతో భారత జట్టు ఘన విజయాన్ని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ లో యువ క్రికెటర్లు హీరోలుగా మారారు. సిరాజ్, రిషబ్ పంత్, గిల్ ,  సుందర్ అద్భుతంగా రాణించారు అని చెప్పాలి. ముఖ్యంగా అవకాశం వచ్చినప్పటికీ సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం తో మహమ్మద్ సిరాజ్ ఒక జీరో గానే ఉన్నాడు..  ఇక రిషబ్ పంత్ ఎన్ని  అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నాడు కానీ ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో మాత్రం ఇద్దరు యువ ఆటగాళ్లు కీలకంగా మారిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: