ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌ తో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్ ఆడనున్న విషయం తెల్సిందే. ఇక సిరీస్‌ లో భాగంగా తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు బీసీసీఐ భారత జట్టును మంగళవారం ప్రకటించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో మొత్తం 18 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో చివరి మూడు టెస్టులకు దూరమైన కెప్టెన్ కోహ్లీ మళ్ళీ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించనున్నాడు.

ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యకు జట్టులో చోటు దక్కగా, ఆస్ట్రేలియాతో జరిగిన చివరి  టెస్టులో మంచి ప్రదర్శన చేసిన వాషింగ్టన్‌ సుందర్‌, అలానే అక్షర్‌ పటేల్‌ లు కూడా ఆల్‌ రౌండర్ కోటాలో జట్టులో చోటు సంపాదించారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన యువ ఓపెనర్ పృథ్వీ షాకు నిరాశ తప్పలేదు. ఇక ఆసీస్‌ పర్యటనలో గాయాలపాలైన సిరీస్‌కు రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, హనుమ విహారిలకు విశ్రాంతి ఇచ్చారు. అలానే ఆసీస్‌ పర్యటనకు ముందే గాయపడిన పేసర్ ఇషాంత్ శర్మ, సిరీస్ మధ్యలో నుంచి వైదొలిగినా కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా భారత్ వేదికగా ఇంగ్లాండ్‌ తో నాలుగు టెస్టుల సిరీస్ జరగనుంది.మొదటి టెస్టు  చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానుంది.

ఇక జట్టు పూర్తి వివరాలు చూస్తే...  విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, మహ్మద్‌ సిరాజ్, శుభ్‌ మన్‌ గిల్, వృద్ధిమాన్‌ సాహా, శార్దూల్‌ ఠాకూర్, మయాంక్‌ అగర్వాల్, హార్దిక్ పాండ్యా, రవి చంద్రన్‌ అశ్విన్, ఛటేశ్వర్‌ పుజారా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సీనియర్ ఆటగాళ్ళు వరుస గాయాలతో దూరమైన యువ ఆటగాళ్ళు సత్తా చాటి 2-1 తో సిరీస్ ను గెలిచి ఆతిథ్య ఆసీస్ కు గట్టి షాక్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: