ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు అనూహ్య విజయాన్ని సాధించి సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టును  మట్టికరిపించిన విషయం తెలిసిందే.  అయితే సాధారణంగా ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించడం మామూలే అయినప్పటికీ.. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకూ ఎప్పుడూ విజయం సాధించని గబ్బా  స్టేడియం లో విజయం సాధించడం.. అది కూడా రెగ్యులర్ కెప్టెన్ లేకపోయినప్పటికీ తాత్కాలిక కెప్టెన్ తో ఈ విజయం అందుకోవడం.. అదే సమయంలో జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయల  బారినపడి జట్టుకు దూరం అయినప్పటికీ యువ ఆటగాళ్లతో దిగ్గజ ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కుని  మట్టి కనిపించడం.. ఇలా ఇవన్నీ జరగడంతో ప్రస్తుతం భారత జట్టుకు ఈ విజయం చారిత్రాత్మక గెలుపు గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.



 టీమిండియా తప్పక ఓడిపోతుంది అని అందరూ అనుకుంటున్న సమయంలో కూడా పట్టువిడవకుండా వీరోచిత పోరాటం చేసిన భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించి భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు పోరాడిన తీరు పై అటు ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది అనే విషయం తెలిసిందే.  ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు కూడా ప్రస్తుతం టీమిండియా పోరాటానికి ఫిదా అయిపోయాము  అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ టీమిండియా జట్టును హెచ్చరించాడు.



 ఇటీవలే గబ్బా  స్టేడియంలో విజయం సాధించిన టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది అనే సంతోషంలో ఉందని.. కానీ అసలైన జట్టు మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో తలపడనుంది. ఆ జట్టు మిమ్మల్ని మీ స్వస్థలం లోనే జోడించవచ్చు.. జాగ్రత్తగా ఉండండి అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ హెచ్చరించాడు. అయితే మరికొన్ని రోజుల్లో స్వదేశంలో భారతజట్టు ఇంగ్లాండు జట్టుతో వరుసగా సిరీస్ లు  ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: