భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతి ఏడాది ఐపీఎల్ ను  ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తుండగా కరోనా వైరస్ ప్రభావం దృశ్య జరుగుతుందో లేదో అనుకున్న విషయాలను మరింత ప్రతిష్టాత్మకంగా భారత్ లో  కాకుండా యూఏఈ వేదికగా  నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ఏడాది కూడా ఐపీఎల్ కోసం  బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం నిర్వహించాలని భావిస్తోంది బీసీసీఐ.



 ఈ నేపథ్యంలోనే ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీలు అన్నీ కూడా తమకు సంబంధించిన జట్ల  నుంచి రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను అంతేకాకుండా జట్టుతో ఉంచుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించాలి అంటూ ఇటీవల ఫ్రాంఛైజీల కు ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే పలు జట్ల  ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను వదిలేసేందుకు  కూడా సిద్ధమవుతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఇలాంటినే పథ్యంలోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్లో అట్టడుగున నిలిచి  తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది.



 మినీ వేలానికి  ముందు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను  రాజస్థాన్ రాయల్స్ జట్టు రిలీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో స్టీవ్ స్మిత్ కి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. స్మిత్ స్థానంలో   జాస్ బట్లర్, బెన్ స్టోక్స్, లేదా సంజు శాంసన్ లకి సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2008లో టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు మళ్లీ టైటిల్ గెలవలేకపోయింది. అయితే 2018లో స్టీవ్ స్మిత్ ను  కెప్టెన్గా ప్రకటించింది రాజస్థాన్. ఇక రెండేళ్లపాటు నిషేధానికి గురైన స్మిత్  2019లో తిరిగి జట్టులోకి చేరుకోగా.. 2020లో మళ్లీ ఫ్రాంచైజీ స్మిత్ కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: