కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ వేదికగా జరిగిన విషయం తెల్సిందే. కాగా ఈ ఏడాది వేసవిలో ఐపీఎల్ 14 వ సీజన్ జరగనుంది. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు కొంత మంది ఆటగాళ్ళను వదులుకున్నాయి. ఇక గత ఏడాది ఐపీఎల్ నుంచి అనూహ్యంగా తప్పుకున్న సురేష్ రైనాను చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక రాజస్థాన్‌ రాయల్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కెప్టెన్, ఆసీస్ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను వదిలేసింది. అలానే యువ ఆటగాడు సంజు శాంసన్‌ కు ఏకంగా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఇక ఐపీఎల్ లీగ్ ప్రారంభం నుంచి ముంబయి జట్టుకు ఆడుతున్న మలింగను ఆ జట్టు వదిలేసింది.  పేలవ ప్రదర్శన చేస్తున్న మాక్స్ ‌వెల్‌ను పంజాబ్ పక్కన పెట్టింది. ఇక ఏయే జట్టు ఎవరిని వదులుకుందో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై: మురళీ విజయ్‌, హర్భజన్‌ సింగ్‌, పియూష్‌ చావ్లా, కేదార్‌ జాదవ్‌, మోనుకుమార్ ‌సింగ్‌, షేన్‌ వాట్సన్‌ (రిటైర్డ్)

ముంబయి ఇండియన్స్‌: లసిత్‌ మలింగ, నేథన్‌ కౌల్టర్‌నైల్‌, జేమ్స్‌ ప్యాటిన్సన్‌, రూథర్‌ఫర్డ్‌, మిచెల్‌ మెక్లెనగన్‌, ప్రిన్స్‌ బలవంత్‌ రాయ్‌, దిగ్విజయ్‌ దేశముఖ్‌

ఢిల్లీ క్యాపిటల్స్: మోహిత్‌ శర్మ, కీమో పాల్‌, సందీప్‌ లామిచాన్‌, అలెక్స్‌ కేరీ, జేసన్‌ రాయ్‌, తుషార్‌ దేశ్‌ పాండే

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టామ్‌ బాంటన్‌, క్రిస్‌ గ్రీన్‌, సిద్దేశ్‌ లాడ్‌, నిఖిల్‌ నాయక్‌, ఎం.సిద్ధార్థ్‌, హ్యారీ గర్నీ

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:  మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, గురుకీరత్‌ సింగ్‌, ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌, పవన్‌ నేగి, ఇరుసు ఉదాన, ఉమేశ్‌ యాదవ్‌

రాజస్థాన్ రాయల్స్‌: స్టీవ్‌ స్మిత్‌

సన్ రైజర్స్  హైదరాబాద్‌: బిల్లీ స్టాన్‌లేక్‌, ఫాబియన్‌ అలన్‌, సంజయ్‌యాదవ్‌, బి సందీప్‌, పృథ్వీరాజ్‌

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: మాక్స్‌వెల్‌, కాట్రెల్‌, నీషమ్‌


మరింత సమాచారం తెలుసుకోండి: