ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫి అభిమానులకు ఎంత వినోదాన్ని పంచిందో అందరికీ తెలిసిందే. సిరీస్ ప్రారంభమైన మొదటి నుండి కూడా ఉత్కంఠభరితంగానే సాగుతూ అసలైన క్రికెట్ మజా అభిమానులకు రుచి చూపించింది. నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో మొదటి టెస్టులో భారత్ ను ఓడించి అసిస్ విజయం సాధించగా రెండవ టెస్టులో ఆసిస్ ను చిత్తుచేసి భారత్ ఘన విజయం సాధించింది. ఇక మూడవ టెస్టులో మ్యాచ్ డ్రా గా ముగించి నాలుగో టెస్ట్ పై నాలుగవ టెస్టుపై ఇరు జట్లు ఆసక్తిని పెంచాయి. ఇక ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్టు లో ఎట్టకేలకు భారత్ విజయకేతనం ఎగురవేసింది.

 గబ్బా వేదికలో 32 ఏళ్లుగా ఓటమి ఎరుగని ఆసీస్ జట్టును చిత్తు చేసి చిరస్మరణీయ విజయం అందుకుంది. ఇదిలా ఉండగా ఈ టెస్ట్ సిరీస్ మొత్తం కొన్ని అనూహ్య సంఘటనలతో ఆద్యంతం వినోదాన్ని పంచింది. అందులో ఒకటి సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్, రిష‌బ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను చెరిపేసే ప్ర‌య‌త్నం చేసి స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ పనిని స్టీవ్ స్మిత్ సమర్థించుకున్నాడు అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా స్మిత చేసిన ఈ పనిని స‌మ‌ర్థించుకున్నారు. అయితే బ్రిస్బేన్ లో జరిగిన చివరి టెస్ట్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా అలాగే చేశాడు.

స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌డు చూస్తుండ‌గానే.. రోహిత్ షాడో బ్యాటింగ్ చేస్తూ స్మిత్‌ వైపు చూస్తూ ముందుకి కదిలాడు. దాంతో స్మిత్, రోహిత్ వైపు చూస్తూ తలదించుకుని ఉండిపోయాడు. అయితే స్మిత్ లాగా బ్యాటింగ్ గార్డ్‌ను రోహిత్ చెరిపేయ‌లేదు. కానీ రోహిత్ అలా చేయడం పట్ల పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు రోహిత్ కావాలనే అలా చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వివాదాస్పద వ్యాఖ్యాత సంజ‌య్ మంజ్రేక‌ర్ ఈ సంఘటన గురించి స్పందిస్తూ.. అప్పుడు స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. రోహిత్ చేసింది కూడా త‌ప్పే అని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. రోహిత్ కావాల‌నే స్మిత్ ముందు ఇలా చేశాడ‌ని అత‌ని బాడీ లాంగ్వేజ్ ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: