ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు చారిత్రాత్మక విజయాన్ని సాధించి ప్రశంసలందుకుంటోంది అన్న విషయం తెలిసిందే. తాత్కాలిక కెప్టెన్ అయినప్పటికీ అజింక్య  రహనే  జట్టును ముందుకు నడిపించిన తీరు ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అయినప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా..  యువ ఆటగాళ్లు పట్టు వదలకుండా అద్భుతమైన పోరాటంతో విజయం సాధించారు. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ఆడుతున్న సమయంలో ఎక్కువ మంది భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలతో రెచ్చగొట్టారు అనే విషయం తెలిసిందే.



 అయితే భారత ఆటగాళ్లకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం సంచలనం గా మారిపోయింది. యువ బౌలర్ అయిన మహమ్మద్ సిరాజ్ సహా జస్ప్రిత్ బూమ్రా పై కూడా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియాఅభిమానులు. అయితే జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సమయంలో అజింక్య రహానే ఫీల్డ్ ఎంపైర్ లతో చెప్పిన ఒక్క మాటతో తన లో కసి పెరిగి పోయింది అంటూ మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.  ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అద్భుతంగా రాణించిన మొహమ్మద్ సిరాజ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని నేరుగా తన తండ్రి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించాడు యువ ఆటగాడు.



 తర్వాత మీడియాతో మాట్లాడిన మహమ్మద్ సిరాజ్...  ఆస్ట్రేలియా అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినప్పుడు తాను అసలు పట్టించుకోలేదని.. కానీ కెప్టెన్ కి చెప్పడం బాధ్యత కాబట్టి అజింక్యా రహానే కు చెప్పడంతో అతను వెంటనే ఈ విషయం ఫీల్డ్ ఎంపైర్ లకు చెప్పాడు అంటూ  మొహమ్మద్ సిరాజ్ తెలిపాడు. మీకు కావాలంటే వెంటనే మైదానం వదిలి వెళ్ళిపొండి అంటూ ఫీల్డ్ ఎంపైర్లు చెప్పడంతో..  మేము మైదానం విడిచి  వెళ్ళము.. ఎందుకంటే మేము ఆటని గౌరవిస్తాం అంటూ  అజింక్య రహానే బదులు ఇచ్చాడని.. ఆ ఒక్క మాటతో కసి  పెరిగిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు మహమ్మద్ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: