ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుపై వీరోచిత పోరాటం చేసి టెస్టు సిరీస్ లో  భాగంగా విజయం సాధించిన విషయం తెలిసిందే.  ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినపుడల్లా మునుపెన్నడూ విజయం సాధించని  గబ్బా  స్టేడియంలో.. తక్కువ  బలంతో బరిలోకి దిగిన భారత జట్టు దిగ్గజ జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి విజయం సాధించడం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప విజయంగా నిలిచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే భారత జట్టు విజయం సాధించి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఎంతో మంది మాజీ క్రికెటర్లు భారత విజయంపై స్పందిస్తూ భారత జట్టు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



 ఇక మరోవైపు ఆస్ట్రేలియా జట్టు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది అనే విషయం తెలిసిందే. ఎంతోమంది మాజీ ఆటగాళ్లు గబ్బ స్టేడియంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసిన ప్రదర్శన తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తి బలం లేకుండానే బరిలోకి దిగిన భారత జట్టును ఆస్ట్రేలియా జట్టు వ్యూహాత్మకంగా ఓడించలేక పోవడం సిగ్గుచేటు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 ఒకవేళ ఇటీవలే భారత్ చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినందుకు గాను టిమ్  ఫైన్ ను  టెస్టు జట్టుకు కెప్టెన్గా తీసివేస్తే స్టీవ్ స్మిత్ కి మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి  ఉంటుంది అని వ్యాఖ్యానించిన ఆయన... 2018 సంవత్సరం లో బాల్ టాంపరింగ్  విషయంలో నిషేధానికి గురైన వార్నర్ కి మద్దతు గా మాట్లాడాడు. వార్నర్ కేమో జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధిస్తే స్మిత్  కేమో కేవలం రెండేళ్లు  మాత్రమే నిషేధిస్తారా  అంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ను ప్రశ్నించారు.  వార్నర్ కంటే  స్మిత్  పెద్ద నేరస్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: