స్వదేశంలో భారత్ తో పోరాడాలంటే ఎంతో శ్రమించాలని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం భారత్ మంచి ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉందని అతను పేర్కొన్నాడు. తమ సొంతగడ్డపై విజయాలు ఎలా సాధించాలో టీం ఇండియాకు బాగా తెలుసని అందువల్ల కోహ్లీసేనతో పోరాడాలంటే అత్యుత్తమానికి మించిన ప్రతిభను కనబరచాలని రూట్ తెలిపారు. అంతేకాకుండా తమ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నట్టు పేర్కొన్నాడు.. భారత్‌లో సిరీసుకు బెన్‌స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌ రావడం జట్టులోకి రావడంతో తమ జట్టు మరింత బలపడుతుందని వెల్లడించాడు.. అయినప్పటికీ భారత్ తో గెలవాలంటే తాము ఎంతో శ్రమించాలని జో రూట్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న రెండవ టెస్ట్ కు ముందు జో రూట్ భారత్ టూర్ పై ఈ విధంగా స్పందించాడు. ఇంగ్లాండ్ జట్టు భారత్ పర్యటనలో మొత్తం నాలుగు టెస్టులు, 5 టీ20 లు, మూడు వన్డేలు ఆడనుంది. కరోనా కారణంగా దాదాపు ఏడాది కాలంగా స్టేడియంలోకి ప్రజలను అనుమతించని బీసీసీఐ. అయితే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించబోతుంది. ప్రస్తుతం భారత్ లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉండడంతో కనీసం 50 శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో లో ఘన విజయం సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ జట్టుతో జరిగే పోరుకు సిద్ధమవుతోంది.

కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ యువ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో ఎలాంటి ఉత్తమ ప్రదర్శన కనబరిచారో అందరికీ తెలిసిందే.. అయితే స్వదేశంలో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో టీమిండియా పోరుకు సిద్దమవుతుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టుతో తలపడేందుకు తిరిగి జట్టులోకి రానున్నాడు. ఆస్ట్రేలియా ఈ పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో మొదటి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ తో జరిగే పోరులో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ మరో ప్రతిష్టాత్మక పోరుకు సర్వం సిద్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: