క్రికెట్ లో కొందరి ఆటగాళ్లపై ఎప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కు మద్య మాటలు లేవంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అలాగే ధోని జట్టులో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ కి ఎం‌ఎస్ ధోనీకి కూడా వెభేధాలు ఉన్నయంటూ రూమర్స్ గుప్పుమన్నా సంగతి తెలిసిందే.  ఇద్దరు ఆటగాళ్లు ఉత్తమ ప్రధర్శన కనబరిస్తే  వారి మద్య ఉండే పోటీని విభేదాలుగా చూపిస్తారు సోషల్ మీడియా బాబులు.

 అధెవిధంగా తాజాగా ఇప్పుడు ఇద్దరి వికెట్ కీపర్ల మద్య విభేదాలు ఉన్నాయంటూ రూమర్స్ గుప్పుమంటున్నాయి. ఆ ఇద్దరు ఎవరో కాదు వృద్దిమన్ సాహా, రిషబ్ పంత్. దీంతో ఈ విషయం పై వృద్దిమన్ సాహా స్పందించాడు." పంత్ తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది..మా ఇద్దరి మద్య గొడవలు ఉన్నాయంటూ వార్తలు సృష్టించకండి " అంటూ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌ పర్యటనలో రిషబ్ పంత్ ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని అన్నాడు అతడు‌ గొప్ప ప్రదర్శన చేసినప్పటికి తన కెరీర్‌కు వచ్చిన ప్రమాదం ఏం లేదని పేర్కొన్నాడు. తుది జట్టులో ఎవరికి చోటు దక్కినా.. సంతోషమే అంటూ పేర్కొన్నాడు..

సలహాలు ఇచ్చుకునే విషయంలో ఇద్దరం కూడా సహాయం చేసుకుంటాం. వ్యక్తిగతంగానూ నాకు పంత్‌తో ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరిలో నెంబర్‌ 1,2 అంటూ ఎవరు లేరు. బ్యాటింగ్‌లో ఎవరిశైలి వారికి ఉంటుంది అంటూ, మ్యాచ్‌లో ఉత్తమంగా రాణించినవారికి జట్టు అవకాశాలిస్తుంది అంటూ పేర్కొన్నాడు. జట్టు ఎంపిక అనేది ప్రదర్శన ను బట్టి యజమాన్యం నిర్ణయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. పంత్ ప్రస్తుతం నిలకడగా ఆడుతూ బ్యాటింగ్ ‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నడని అలాగే‌ కీపింగ్‌లోనూ క్రమక్రమంగా మెరుగు పడుతున్నడని పేర్కొన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: