ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన లో భాగం గా భారత క్రికెటర్లు అద్భుతంగా రాణించి ఘన విజయాన్ని సాధించారు అన్న విషయం తెలిసిందే.  ముఖ్యం గా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ లో భాగం గా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది భారత జట్టు.  జట్టులో కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరం అవుతున్నప్పటికీ కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా కేవలం యువ ఆటగాళ్లు మాత్రమే ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లలాగా మెరుగైన ప్రదర్శన చేసి చివరికి అద్భుత విజయాన్ని సాధించారు. ఈ క్రమం లోనే ప్రస్తుతం టీమిండియా సాధించిన విజయం పై ప్రశంసల వర్షం కురుస్తోంది అనే విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం ఎంతో మంది మాజీ క్రికెటర్లు టీమిండియా యువ ఆటగాళ్లు సాధించిన విజయం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాదు కీలక ఆటగాళ్లు గాయాల బారినపడి జట్టుకు దూరమైనప్పటికీ మరో వైపు ఆస్ట్రేలియా అభిమానులు  భారత ఆటగాళ్ల పై జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొడుతున్నప్పటికీ యువ ఆటగాళ్లు మాత్రం అద్భుతం గా రాణించి  ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించడం అద్భుతం అంటూ కొని యాడుతున్నారు.



 అయితే ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ గెలవడం లో యువ ఆటగాళ్లదే  కీలక పాత్ర అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.  అయితే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆరుగురు యువ ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపార వేత్త అయిన ఆనంద్ మహీంద్రా ఇటీవలే బంపర్ ఆఫర్ ప్రకటించాడు. నటరాజన్, సిరాజ్, ఠాగూర్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, గిల్ లకు కార్లు బహుమతిగా ఇస్తున్నట్లు ఇటీవలే ఆనంద్ మహీంద్రా ప్రకటించారు ఇదంతా తన సొంత డబ్బులతోనే ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ ఈ యువ క్రికెటర్లు తమను తామునమ్ముకొని జట్టు కోసం ఆడిన తీరు అద్భుతం అంటూ కొనియాడారు ఆనంద్ మహీంద్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: