గత ఏడాది చివర్లో ఐపీఎల్ టోర్నీ ఎంతో రసవత్తరంగా సాగింది అనే విషయం తెలిసిందే. సాధారణంగా వేసవిలో జరిగే.. ఐపీఎల్ టోర్నీ కాస్త కరోనా  వైరస్ కారణంగా వాయిదా పడి చివరికి..  భారత్ లో  కాకుండా యూఏఈ వేదికగా గత ఏడాది చివరిలో జరిగింది. ఇక ఈ ఏడాది అనుకున్నట్లుగానే ముందుగా ఐపీఎల్ నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోందిm ఈ క్రమంలోనే ప్రస్తుతం బిసిసిఐ దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఆయా జట్లకు  సంబంధించిన ప్రాంఛైజీలు తమ జట్ల  నుంచి వదిలేసుకునె ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి అంటూ బీసీసీఐ  కోరింది.



 పలు ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్లను వదులుకోవడం చర్చనీయాంశంగా మారింది అన్న విషయం తెలిసిందే. అయితే మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభం లోనే కోల్కతా నైట్రైడర్స్ జట్టు పక్కనపెట్టేసింది. అతని  స్థానంలో వరుణ్ చక్రవర్తిని ఆడించింది.  ఇక ఇటీవల 2021 సీజన్ కోసం  కుల్దీప్ యాదవ్ ను  కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మరగా దీనిపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ఐపీఎల్ సీజన్లో.. కేవలం ఐదు మ్యాచ్లలో మాత్రమే కూల్దిప్ యాదవ్ ని కోల్కత నైట్ రైడర్స్ ఆడించిందని.. ఇక ఐదు మ్యాచ్ లలో  కుల్దీప్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు అంటూ గుర్తు చేశాడు.



 తర్వాత కుల్దీప్ యాదవ్ పై వేటు వేసిన కోల్కతా నైట్రైడర్స్ యాజమాన్యం వరుసగా యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇచ్చింది అంటూ తెలిపాడు గౌతం గంభీర్. భారత్ జట్టుకి ఆడుతున్న కుల్దీప్ యాదవ్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కనీసం తుది జట్టులోకి కూడా తీసుకోకపోవడం అతని కెరీర్‌ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. గత ఏడాది కుల్దీప్ యాదవ్‌కి కోల్‌కతా ఎక్కువగా అవకాశాలివ్వలేదు. మరి ఈ ఏడాది ఎందుకు రిటైన్ చేసుకోవాలి..? వేలంలోకి వదిలేస్తే.. తుది జట్టులో ఆడించే ఫ్రాంఛైజీకి అతను వెళ్తాడు. కుల్దీప్ కూడా ఇదే విషయాన్ని కోల్‌కతా ఫ్రాంఛైజీ‌ని అడగాలి. టీమ్ ప్రణాళికల్లో తను లేనప్పుడు.. వేరొక జట్టులోకి వెళ్లేందుకు అనుమతించాలని కుల్దీప్ ఫ్రాంచైజీని కోరడం ఎంతో బెటర్. ఒకవేళ కుల్దీప్ యాదవ్ వేలంలోకి వెళ్తే..? చాలా ఫ్రాంఛైజీలు అతని కోసం పోటీపడతాయి ’’అని గంభీర్ వెల్లడించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: