సాధారణంగా బీసీసీఐ  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్ల పేర్లు తెర మీదికి వచ్చి గా వైరల్ గా  మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇక ఐపీఎల్ కంటే ఇటీవలే కొంతమంది యువ ఆటగాళ్ల పేర్లు ఆస్ట్రేలియా సిరీస్ లో ఎంతో వైరల్ గా మారిపోయాయి.  కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న సమయంలో..  అప్పుడప్పుడే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతున్న అనుభవం లేని యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి పోరాటపటిమ కనబర్చిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ లో  అద్భుతంగా రాణించి భారత జట్టుకు విజయం అందించిన యువ ఆటగాళ్ల పేర్లలో ఒకటి వాషింగ్టన్ సుందర్.  అతి తక్కువ అనుభవం ఉన్నప్పటికీ భారత జట్టు తరఫున ఎంతో కసి తో ఆడి చివరికి భారత జట్టుకు విజయం అందించడంలో కీలక పాత్ర వహించాడు వాషింగ్టన్ సుందర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు వాషింగ్టన్ సుందర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా అటు ఎంతోమంది అభిమానులు ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం యువ ఆటగాడు వైరల్ గా మారిపోయాడు.



 అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా వాషింగ్టన్ సుందర్ కు ఎదురైన ఒక వింత అనుభవం గురించి.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ శ్రీధర్ ఇటీవలే ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. గబ్బ టెస్ట్ ప్రారంభం ముందు వరకు కూడా వాషింగ్టన్ సుందర్ కు బ్యాటింగ్  ప్యాడ్స్  లేవట. వాస్తవంగా అయితే వాషింగ్టన్ సుందర్ ను టి20 సిరీస్ కోసం ఎంపిక చేసినప్పటికీ  ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఉంచుకొనినెట్  ప్రాక్టీస్ బౌలర్ గా  పెట్టుకుంది టీమిండియా. ఇక చివరికి మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనుకున్న కొన్ని గంటల ముందు ఒక దుకాణంలో తెలుపు రంగు ప్యాడ్స్  దొరకడంతో అతనికి బ్యాటింగ్ చేసేందుకు అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా బ్యాటింగ్ కోచ్ శ్రీధర్.

మరింత సమాచారం తెలుసుకోండి: