ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తాత్కాలిక కెప్టెన్ గా మారిపోయి టీమిండియాను ముందుకు నడిపించిన అజింక్య రహానే ప్రస్తుతం భారత క్రికెట్ లో సూపర్ కెప్టెన్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అజింక్యా రహానే సారథ్యం పై ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ ప్రారంభం అయిన సమయంలో మొదటి టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించగా వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు అజింక్య రహానే.


 ఇక విరాట్ కోహ్లీ లాంటి ఫుల్ టైం కెప్టెన్ ఉన్న సమయంలోనే ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఇక మొదటి మ్యాచ్  తర్వాత వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా నుండి భారత్ వచ్చేసాడు. ఈక్రమంలోనే ఇక భారత జట్టు బాధ్యతలు అజింక్య రహానే చేజిక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.  విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు గెలవలేదు అని అందరూ అనుకున్నారు. కానీ..  ఊహించని విధంగా అజింక్య రహానే తన కెప్టెన్సీతో  మూడు మ్యాచ్లలో ఓటమి అనేది లేకుండా దూసుకొచ్చాడు.


 చివరికి ఒక చారిత్రాత్మక విషయాన్ని భారత జట్టుకు  కట్టబెట్టాడు కెప్టెన్ అజింక్యా రహానే. ఇటీవలే ఈ విజయంపై  మాట్లాడినా అజింక్య రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఆస్ట్రేలియా టూర్ ఎన్నో అనుభవాలను, జ్ఞాపకాలను ఇచ్చింది అంటూ అజింక్య రహానే చెప్పుకొచ్చాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడినప్పటికీ ఒక గంట వ్యవధిలోనే పూర్తిగా మ్యాచ్ స్వరూపం మారిపోయింది అని చెప్పుకొచ్చాడు. ఇక అప్పుడే ప్రతి మ్యాచ్ లో కూడా చివరి వరకూ పోరాడాలని నిర్ణయించుకున్నాము  అంటూ తెలిపాడు అయితే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో  కుల్దీప్ యాదవ్ ఆడక పోయినప్పటికీ.. అతడు కూడా మ్యాచ్ విన్నర్ అంటూ చెప్పుకొచ్చాడు అజింక్యా రహానే.

మరింత సమాచారం తెలుసుకోండి: