క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌(2021)కు అంతా సిద్ద మౌతుంది. ఈ సీజన్ కు సంబంధించి మినీ వేలం ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఈ మేరకు ఐపీఎల్‌ తన ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికే ఐపీఎల్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీలు రిటైన్‌, రిలీజ్‌ ఆటగాళ్ల లిస్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి అంతా కూడా స్టార్ ఆటగాళ్ళే వేలానికి రావడం వేశేషం అనే చెప్పుకోవాలి.

ముఖ్యంగా లసిత్‌ మలింగ, స్టీవ్‌ స్మిత్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, హర్భజన్‌ సింగ్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రిలీజ్‌ చేయడంతో 2021 ఐపీఎల్‌ సీజన్‌కు వేలంలోకి రానున్నారు ముంబై ఇండియన్స్ లో లసిత్ మలింగ దాదాపుగా ఎనిమిదేళ్లుగా కొనసాగిన నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం అతన్ని జట్టు విడుదల చేసింది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ప్రేయర్ స్టీవ్ స్మిత్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు విడిచిపెట్టింది. స్టార్ ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికి గత సీజన్ లో స్మిత్ ఫెళవ ప్రదర్శన తోనే నిరాశ పరిచాడు. దీంతో రాయల్స్ జట్టు స్మిత్ ను విడుదల చేసి అతడి స్థానం లో సంజు సంసాన్ ను కెప్టెన్ గా ప్రకటించింది.

 ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఒకప్పుడు విద్వంసక ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ ప్రస్తుతం గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో వెనుదిరుగు తున్నాడు. దీంతో ఈ సారి పంజాబ్ అతన్ని విడిచిపెట్టింది.అయితే ఈ స్టార్ ఆటగాళ్లను ప్రస్తుతం ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యగా స్టీవ్ స్మిత్ కోసం ధోని జట్టు సి‌ఎస్‌కే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. స్మిత్ తో పాటు రాబిన్ ఊతప్ప కూడా ఈ సారి చెన్నై తో కలిశాడు. మరి ఈ సీజన్ లో ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శనతో ఆకట్టుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: