భారతదేశంలో క్రికెట్ ఆట కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ ఎంతో ఆనందపడిపోతూ వుంటాడు. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ ఆటను ఫ్యాషన్ గా మార్చుకొని ఇక భారత జట్టులో స్థానం సంపాదించటానికి ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతుంటారు.  భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలని ఎంతగానో కోరుకుంటున్న యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా మారిపోతుంది అనే విషయం తెలిసిందే.


 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో బాగా రాణించిన ఆటగాళ్లను బిసిసిఐ భారత తుది జట్టు ఎంపిక చేసే అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత టెస్ట్ జట్టులో శుబ్ మన్ గిల్  స్థానం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఐపీఎల్లో బాగా రాణించిన శుబ్ మన్ గిల్ భారత జట్టులో స్థానం సంపాదించుకోవాలనే తన ఆశను నెరవేర్చుకున్నాడు. భారత జట్టు లో తాను సెలెక్ట్ అయ్యాను అని బీసీసీఐ  అధికారులు చెప్పినప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు శుబ్ మన్ గిల్.


 సాధారణంగా భారత జట్టులో స్థానం దక్కించుకోవాలని   ఎంతో మంది ఆటగాళ్లు కోరుకుంటారని అలాంటి అవకాశం వచ్చినప్పుడు తనకు టెన్షన్ తో  రాత్రంతా నిద్ర పట్టలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నిద్ర పట్టడానికి స్లీపింగ్ టాబ్లెట్ లు కూడా వేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టులో రెండవ టెస్ట్ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న శుబ్ మన్ గిల్ ఇక మొదట ఈ మ్యాచ్లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. కానీ చివరి మ్యాచ్లో మాత్రం 91 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: