ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా నెటిజన్లు వారిని సమస్యల్లోకి నెడతారు. అయితే కొన్ని సార్లు ఏ తప్పూ చేయకపోయినా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా ఐపీఎల్ స్టార్ బౌలర్, యార్కర్ కింగ్ నటరాజన్ ఇలాంటి సమస్యల్లోనే చిక్కుకున్నాడు. తాజాగా నటరాజన్ తనకు కూతురు పుట్టి 4 నెలలు పూర్తైన నేపథ్యంలో భార్య, బిడ్డతో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేశాడు. దానికి ఓ ఉద్వేగపూరిత కామెంట్‌ జతచేశాడు. అలాగే కుమార్తెలే బెస్ట్ అంటూ రాసుకొచ్చాడు.

ఈ క్రమంలోనే తన కూతురు పేరును కూడా వెల్లడించాడు. తన కూతురికి హన్విక అని పేరు పెట్టినట్లు వెల్లడించాడు.‘జీవితంలో మేము అందుకున్న అత్యంత అందమైన బహుమతి నువ్వే. మా జీవితాలు ఇంత సంతోషకరంగా మారడానికి కారణం నువ్వే. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు థాంక్యూ లడ్డూ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. మా చిన్నారి దేవత హన్విక’ అంటూ తన భార్య, కూతురుతో పంచె కట్టులో ఉన్న ఫోటోను పంచుకున్నాడు. అయితే ఇదే అతడికి సమస్యలను తెచ్చిపెట్టింది.

కూతురికి పెట్టిన పేరుపై నటరాజన్‌ మీద కొందరు తమిళ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పేరు పెట్టకుండా ఉత్తరాది పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమిళంలో పేరు పెట్టొచ్చు కదా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తన కూతురి పేరు అర్థాన్ని కూడా నటరాజన్ ముందుగానే వివరించాడు. హన్విక అంటే సరస్వతి, లక్ష్మీ దేవి నెమలి అని అర్థమని చెప్పాడు. అయినా ఉత్తరాది పేరు పెట్టడంపై తమిళ ఫ్యాన్స్ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మరి దీనిపై నట్టూ ఎలా రిప్లై ఇస్తాడో చూడాలి.

ఇదిలా ఉంటే  త్వరలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో నటరాజన్‌కు చోటు దక్కింది. మార్చి 12 నుంచి 20 మార్చి వరకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌లలో నట్టూ ఆడబోతున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: