ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య  టెస్ట్ సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సొంతగడ్డపై మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి పాలైన టీమిండియా ఇక ఆ తర్వాత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్లో ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. ఇక అనుకున్న విధంగానే అద్భుతంగా పుంజుకున్న టీమిండియా...  ఏకంగా ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూశారు.


 సాధారణంగా టెస్ట్ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కానీ మూడవ టెస్ట్ మ్యాచ్ మాత్రం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం  అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.  అయితే ఇక మొతేరా స్టేడియంలో అటు ఇంగ్లాండ్ బౌలర్లలో పాటు ఇటు భారత బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు అనే చెప్పాలి.  ఇరు జట్లకు సంబంధించిన బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను  ఎక్కువ పరుగులు చేయకుండా కట్టడి చేయడంలో విజయం సాధించారు.



 ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ బ్యాట్ మెన్స్  మాత్రం అందరూ తేలిపోవడంతో మోతెర  స్టేడియంలోని పిచ్ టెస్ట్ క్రికెట్ కు అనువైనది కాదు అంటూ ఎంతో మంది క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే దీనిపై స్పందించిన రోహిత్ శర్మ భిన్నంగా స్పందించారు. మొతేరా స్టేడియం లోని పిచ్  బ్యాటింగ్ కి కష్టంగా ఏం లేదని అనుకూలంగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కేవలం రెండు రోజుల్లోనే టెస్ట్ క్రికెట్ లో 30 వికెట్లు పడినప్పటికీ నా వరకైతే పిచ్  బాగానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇరు జట్ల కు చెందిన ఆటగాళ్లు సరైన టెక్నిక్ అప్లైడ్ చేయలేకపోయారని ఆటగాళ్లు కొత్తగా నేర్చుకోవడానికి ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: