ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళా క్రికెటర్ మాట్లాడిన మాటలపై ఇంగ్లండ్ క్రికెటర్ రోరీ బర్న్స్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె అలా మాట్లాడుతుందని తాను ఎన్నడూ అనుకోలేదని, అయితే అలా మాట్లాడడం ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని అన్నాడు. ఇండియాతో జరిగిన టెస్టులో దారుణంగా ఓడిపోయిన ఇంగ్లీష్ టీంపై ఆ దేశానికే చెందిన ఓ మహిళా క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై బర్న్స్ ఇలా స్పందించాడు.

అయితే తాను కానీ, తన జట్టు కానీ మహిళలకు, మహిళా క్రికెట్‌తో ఎంతో ప్రాముఖ్యం ఇస్తామని, వారి ఆటను ఎంతో ప్రోత్సహించి, వారి మ్యాచ్‌లను కూడా ప్రమోట్ చేస్తామని కానీ ఆమె పురుషుల క్రికెట్ జట్టును కించపరుస్తూ మాట్లాడడం ఊహించని పరిణామమని బర్న్స్ అన్నాడు.

ఇండియా-ఇంగ్లండ్ మధ్య పేటీఎం సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఇంగ్లండ్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ ఓటమిపై ఆ దేశ మహిళా క్రికెటర్ అలెగ్జాండ్రా హార్ట్‌లీ ట్రోల్ చేసి విమర్శలపాలైంది.

‘మహిళల మ్యాచ్ రాత్రికి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంగ్లండ్ మెన్స్ జట్టు ఇండియాతో టెస్టు మ్యాచ్‌ను రెండు రోజుల్లోనే ముగించి మంచి చేశారం’టూ హార్ట్‌లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీనిపై స్పందించిన ఇంగ్లండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ ఓ జాతీయ క్రికెటర్‌ నుంచి ఇలాంటి స్పందన ఆశించలేదని, ఆమె పద్ధతి చాలా బాధించిందని అతడు రాసుకొచ్చాడు. నెటిజన్లు కూడా ఈ విషయంలో ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యం సాధించింది. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇండియా ఓడినప్పటికీ ఆ తరువాత అదే పిచ్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలిచింది. అలాగే ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి సిరీస్‌లో ఆధిక్యం సాధించిది. ఇక చివరి టెస్టు మ్యాచ్ వచ్చే నెలలో జరగనుంది. ఆ మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది. అలాగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో భాగంగా జూన్‌లో జరగనున్న ఫైనల్‌కు అర్హత సాధించే జట్టును కూడా నిర్ణయిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇండియా ఆ రేసులో ముందుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: