ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే.. వెస్టిండీస్ క్రికెటర్ అయినప్పటికీ యూనివర్సల్ బాస్  క్రిస్ గేల్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్నారు. ఇక ఒక్కసారి క్రిస్గేల్ రంగంలోకి దిగాడు అంటే చాలు స్కోర్ బోర్డు పరుగులు పెట్టడం ఖాయం అని అందరికీ అర్థమైపోతుంది. ఏకంగా ఎలాంటి ఫుట్ వర్క్ లేకుండా నిలబడిన  చోట నుంచి భారీ సిక్సర్లు కొట్టడం లో క్రిస్ గేల్ దిట్ట అన్న విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం 40 ఏళ్ల వయసు దాటి పోయినప్పటికీ క్రిస్ గేల్ రిటైర్మెంట్ గురించి మాత్రం ఎక్కడా ఆలోచించడంలేదు. అభిమానులు క్రిస్ గేల్ రిటైర్ అవుతారేమో అని అనుకున్నప్పటికీ ఎన్నో సార్లు తనకు ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్దేశం మాత్రం లేదు అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ గేల్. ఇక వయస్సు 40 దాటిపోతున్నా ఇప్పటికీ అదే ఫిట్నెస్ మెయిన్టెయిన్ చేస్తూ అద్భుతమైన ప్రదర్శన తో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన క్రిస్ గేల్.. మరోసారి వెస్టిండీస్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.




 దాదాపు రెండేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు ఈ స్టార్ క్రికెటర్. శ్రీలంకతో వెస్టిండీస్ ఆడబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కు చోటు దక్కించుకున్నాడు క్రిస్ గేల్. చివరిసారిగా 2019 లో వెస్టిండీస్ అంతర్జాతీయ జట్టులో టి20 సిరీస్ ఆడాడు.  ఇక ప్రస్తుతం మరోసారి 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా క్రిస్ గేల్ అద్భుతమైన ఫామ్ లో  కొనసాగడంతో...  ఇక టీ20ల్లో చోటు దక్కించుకున్నాడు. మరి ఈసారి టీ-20లో క్రిస్ గేల్ ఎలా రాణిస్థాడో  అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: