గత కొన్ని రోజుల నుంచి టీమిండియా ఆటగాళ్లకు విశ్రాంతి అనేది లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే.  కరోనా  వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న సమయంలోనే బిసిసీఐ  ఎంతో ప్రతిష్టాత్మకంగా యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో భాగంగా ఆటగాళ్లు అందరూ కూడా ఎక్కడా బయటికి వెళ్లకుండా నిబంధనలు పాటిస్తూ మ్యాచ్లు ఆడారు.  ఆ తర్వాత ఎలాంటి విశ్రాంతి లేకుండానే భారత ఆటగాళ్లు అటు నుంచి అటే ఆస్ట్రేలియా పర్యటన కోసం బయలుదేరారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో కూడా భారత జట్టు సత్తా చాటింది.



 ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని  రాగానే భారత జట్టు ప్రస్తుతం సొంత గడ్డపై ఇంగ్లాండ్తో వరుసగా సిరీస్ లు  ఆడేందుకు సిద్దం అవుతుంది అన్న విషయం తెలిసిందే.  ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఆడుతున్నది  భారత జట్టు. అయితే మూడు టెస్ట్ మ్యాచ్ లు జరగ్గా.. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది.  ఇకపోతే గత కొన్ని రోజుల నుంచి క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఎలాంటి విశ్రాంతి లేకుండా ఆటగాళ్లు ఆడుతూ ఉండడం వల్ల ఎంతో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని భావించిన బిసిసిఐ కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ఇంగ్లాండ్తో జరిగే బోయే మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా రిషబ్ పంత్ వాషింగ్టన్ సుందర్ తో పాటు మరో ఎనిమిది మంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేందుకు బిసిసిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు ఎన్నో రోజుల నుంచి బయోటెక్ సెక్యూర్  బబుల్ పద్ధతి కే పరిమితం కావడం వల్ల ఇక మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని భావించి ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.  ఇకపోతే ప్రస్తుతం విశ్రాంతి ఇవ్వదలచిన ఆటగాళ్లు స్థానాల్లో ఏ ఆటగాళ్లను ఎంపిక చేయబోతున్నారు  అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.  ఇకపోతే ప్రస్తుతం సొంత గడ్డపై భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: