ఇండియన్ ప్రీమియర్ లీగ్ వస్తుందంటే చాలు భారత క్రికెట్ ప్రేక్షకులందరూ ఎంతలా ఉర్రూతలూగి పోతారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. గత 13 సీజన్ ల నుంచి కూడా ఐపీఎల్ అంతకంతకూ క్రేజ్  సంపాదించుకుంటూ క్రికెట్ ప్రేక్షకులందరికీ ఫుల్ టైమ్ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ దూసుకుపోతుంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ అనుకున్న సమయానికి నిర్వహించేందుకు బిసిసీఐ  ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ లో భాగంగా మినీ వేలం  కూడా పూర్తి చేసింది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.



 ఇకపోతే ఐపీఎల్ ఎప్పటిలాగానే అన్ని వేదికలలో నిర్వహిస్తారు అని అనుకున్నప్పటికీ  వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం కొన్ని వేదికలలో మాత్రమే ఐపీఎల్ నిర్వహిస్తారు అని  ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపందుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం ఆరు వేదికల్లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే బిసిసిఐ నిర్ణయం పై మాత్రం అటు ఐపీఎల్ లోని మూడు జట్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్,  పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు  ప్రస్తుతం బీసీసీఐ  నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.



 ఈ క్రమంలోనే బిసిసిఐ ఆరు వేదికల్లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించాలి అన్న  నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటూ ఈ మూడు జట్లు నిరసన తెలుపుతున్నట్లు  తెలుస్తోంది. బీసీసీఐ  తీసుకున్న ఈ నిర్ణయంతో స్థానిక అనుకూలత తమకు దూరం అవుతుంది అంటూ చెబుతున్నాయి. చెన్నై బెంగుళూరు ఢిల్లీ కోల్కతా అహ్మదాబాద్ వేదికల్లో బీసీసీఐ  ఐపీఎల్ నిర్వహించాలని భావిస్తూ ఉండగా ఇక మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ముంబైలో కూడా ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని యోచిస్తోంది. మరి ప్రస్తుతం అటు అభిమానులు కూడా బీసీసీఐ నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బీసీసీఐ నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా లేకపోలేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: