ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్ లో  భారత జట్టు అద్భుతంగా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు వరకు ఏకంగా ఇంగ్లాండ్ జట్టు  తో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడింది భారత జట్టు. అయితే మూడు టెస్ట్ మ్యాచ్లలో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయి విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని రెండు టెస్ట్ మ్యాచ్లలో విజయం సాధించి అన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవలే మూడవ టెస్ట్ అహ్మదాబాద్లోని మొతేరా   జరిగింది.  ఈ మొతేరా స్టేడియంలో అద్భుతంగా రాణించిన భారత బౌలింగ్  విభాగం..  ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లను తక్కువ పరుగులకే మట్టి కరిపించడంలో విజయం సాధించారు.



 ఇక ఆ తర్వాత భారత జట్టు మంచి విజయం సాధించింది. అయితే ఇక ఓటమి తర్వాత స్పందిస్తున్న ఇంగ్లాండ్  ఆటగాళ్లు అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియంలో పిచ్ టెస్ట్ క్రికెట్ కు సరైనది కాదు అంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు విమర్శలకు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల స్పందించిన భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగవ టెస్టు పిచ్  కూడా అలాగే ఉండబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు అజింక్యా రహానే.



 ఇంగ్లాండ్ తో  జరిగిన గత టెస్ట్ మ్యాచులలో పిచ్ ఎలాగైతే ఉందో ఇక చివరి టెస్టు మ్యాచ్లో కూడా అలాగే ఉంటుంది అంటూ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలి కాలంలో మూడవ టెస్ట్ ఓటమి తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లు పిచ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అజింక్య రహానే ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తాము విదేశాల్లో పర్యటించినప్పుడు పేస్ బౌలర్ కి పిచ్  సహకరించినప్పుడు తాము ఎప్పుడూ ఎక్కడా ఫిర్యాదు చేయలేదు అంటూ గుర్తు చేశాడు అజింక్యా రహానే. ఇకపోతే భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే నాలుగో టెస్ట్ ఎవరు గెలవ బోతున్నారు అనేది నిర్ణయించబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: