టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మొదలైన తరువాత అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఓపెనర్ గా హిట్ మ్యాన్ రికార్డ్ సృష్టించాడు. మోతెరా స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈ రికార్డుకు వేదికగా నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 49 పరుగులకే ఔట్ అయినప్పటికీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే(కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే) అత్యంత ఫాస్ట్‌గా 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డ్ సృష్టించాడు.

 అంతేగాక టెస్టులో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి ఆసియా ఓపెనర్‌గా.. టీమిండియా నుంచి రెండో ఆటగాడిగా నిలిచాడు. మొదటి టీమిండియా ఆటగాడిగా వినోద్‌ కాంబ్లికి 14 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత వహించగా.. రోహిత్‌ వెయ్యి పరుగులు పూర్తి చేయడానికి 17 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఆ తర్వాతి స్థానంలో టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా(18 ఇన్నింగ్స్‌లు), మయాంక్‌ అగర్వాల్‌( 19 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు.

 ఇక ఈ జాబితాలో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 948 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా ఆటగాడు డీన్ ఎల్గర్ 848 పరుగులతో మూడో స్థానంలో నిలిచడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు డొమినిక్ సిబ్లి 841, మయాంక్ అగర్వాల్ 810 ఆ తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఇక అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు రిషబ్ పంత్,వాషింగ్టన్ సుందర్ లు చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 94 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. దాంతో ఇప్పటి వరకు భారత్ 89 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: