మొన్నటి వరకు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఇప్పుడు మాత్రం అద్భుతంగా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటూన్నాడు అన్న విషయం తెలిసిందే.  ఇక రిషబ్ పంత్ కెరీర్ ప్రస్తుతం పిక్స్ లో కొనసాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతూ సెంచరీలతో అదరగొడుతున్నాడు రిషబ్ పంత్.  ఈ క్రమంలోనే ఇక టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ప్రతి మ్యాచ్లో కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ కూడా ఆదుకుంటూ పరుగులు చేస్తున్నాడు రిషబ్ పంత్.


 ఇక ఇటీవల ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్లో కూడా రిషబ్ పంత్ అద్భుతంగా సెంచరీ చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అన్న విషయం తెలిసిందే.  టెస్ట్ క్రికెట్ ఆడుతున్న విషయాన్ని కూడా మర్చిపోయి వన్డే, టి20 ఆడుతున్న విధంగా విధ్వంసాన్ని సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకొని జట్టును భారీ స్కోరు దిశగా తీసుకెళ్లడంలో విజయం సాధించాడు. ఈ క్రమంలోనే రిషబ్ పంత్ సెంచరీ కి ఫిదా అయిన మాజీ క్రికెటర్లు అందరూ కూడా రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.



 కాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో అద్భుతంగా రాణించి అదరగొట్టి సెంచరీ సాధించిన యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్..  ఇక ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఇంగ్లాండ్ భారత్ ఆస్ట్రేలియాలో వరుసగా సెంచరీలు సాధించిన రెండవ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్గా నిలిచాడు రిషబ్ పంత్. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఆయన గిల్ క్రిస్ట్ సరసన చేరాడు. మొదటగా ఇలా ఆస్ట్రేలియా భారత్ ఇంగ్లాండ్ లలో  వికెట్ కీపర్ గా ఉండి సెంచరీలు  సాధించిన ఆటగాడిగా గిల్ క్రిస్ట్ రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు ఆ దిగ్గజం సరసన చేరిపోయాడు రిషబ్ పంత్.  ఇప్పటికే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లో సెంచరీ చేసిన రిషబ్ పంత్ ఇటీవలే భారత్లో కూడా సెంచరీతో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: