ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ నిర్వహణలో భారత క్రికెట్ బోర్టు వేగం పెంచింది. టోర్నీ నిర్వహించబోయే వేదికలతో పాటు మ్యాచ్‌లు నిర్వహించే తేదీలను శనివారం ప్రకటించిన బోర్డు నేడు(ఆదివారం) ఏ మ్యాచ్‌ ఎవరి మధ్య జరుగుతుంది..? ఏ మైదానంలో జరుగుతుంది..? ప్లే ఆఫ్స్ ఎప్పటి నుంచి..? ఫైనల్ఎ ప్పుడు..? వాటికి ఏ మైదానాలు ఆతిథ్యమిస్తాయి..? అనే విషయాలను స్పష్టంగా వెల్లడించింది. దీనికి సంబంధించి తాజాగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇక టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా.. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకు జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లుగా జరగనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లన్నీ ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతాయి. వారాంతాల్లో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం.3.30 గంటల మొదలైతే.. సాయంత్రం మ్యాచ్ యథావిధిగా 7:30 గంటలకు మొదలవుతుంది.

ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్ భారత్‌లో నిర్వహించేందుకు వీలు లేకపోవడంతో దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో నిర్వహించారు. కానీ ఈ సారి ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ కావడమే కాకుండా దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆటగాళ్లంగా బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్‌లను ఆడేలా ప్రణాళిక సిద్ధం చేసింది. టోర్నీకి ముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో వరుసగా మూడుసార్లు నెగెటివ్ వచ్చినవారిని మాత్రమే ఆడేందుకు అనుమతించనున్నారు.

ఐపీఎల్ షెడ్యూల్:


మరింత సమాచారం తెలుసుకోండి: