తనపై సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ ను సరదాగా తీసుకుంటానని, వాటి గూర్చి భాద పడనని టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నారు. సోషల్ మీడియా వచ్చిన తరువాత నచ్చని వారిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తూ కొందరు ఆకతాయిలు చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఎందరో సెలబ్రేటీలు, క్రికెట్ స్టార్లు ట్రోలింగ్ బారిన పడుతూ అసహనానికి గురి అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి ట్రోల్స్ పైన టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి చేసిన  వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

 నెటిజన్లు సరదా కోసం తనపై అలాంటివి చేస్తారని, వాటిని ఇంకా అశ్వధిస్తానని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ట్రోలింగ్ రాయుళ్ళకు గట్టిగానే కౌంటర్ వేశాడు. "నాపై నెటిజన్స్ చేసే మీమ్స్ సరదాగా జరిగే ప్రక్రియ. వాళ్లు నవ్వుకోవడానికే అవన్నీ చేస్తారు. నాకు నష్టం కలిగేలా ఉన్నా ఫర్వాలేదు. నాకేమీ ఇబ్బందీ లేదు. నా పేరు చెప్పుకొని ఒక కూల్‌డ్రింక్‌ తాగండి. నా గురించి చేసే మీమ్స్‌తో ప్రజలు కాసేపు నవ్వుకుంటారు, వాటిని ఆస్వాదిస్తారు. అవి నన్నేం బాధ పెట్టవు" అని రవి శాస్త్రి ఎంతో హుందాగా సమాధానం ఇచ్చాడు. 

క్రికెట్‌లో బాగా ఆడుతూ.. విజయాలు సాధిస్తున్నంత కాలం ప్రజలు సంతోషంగా ఉంటారని, ఒకవేళ ఓటములు లేదా వైఫల్యాలు ఎదురైతే అందుకు తగిన విమర్శలు, ప్రతిఫలాలు ఎదుర్కోవలసి వస్తుందని హెడ్ కోచ్ పేర్కొన్నాడు. ఇక ఇటీవల ఇంగ్లాండ్‌ జట్టుతో జరిగిన మూడో టెస్టు చాలా తక్కువ సమయంలోనే అనగా రెండు రోజుల్లోనే పూర్తి కావడం వల్ల తనపై వచ్చిన ఓ సరదా మీమ్‌ పై రవి శాస్త్రి సరదాగా సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎవరో చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ఆయన.. ఆ జోక్‌ బాగుందని, తనకు నచ్చిందని ప్రతిస్పందించాడు. .

మరింత సమాచారం తెలుసుకోండి: