క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2021 షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు ప్రేక్షకుల్లో ఎంత ఆధారణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఆధరించబడుతున్న స్వదేశీ ప్రీమియర్ లీగ్ గా గుర్తింపు పొందింది. అంతటి ప్రజాధరణ ఉన్న ఐపీఎల్ గత ఏడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే అరబ్ కంట్రీలో నిర్వహించారు అయినప్పటికి టెలివిజన్ లో అత్యధిక టి‌ఆర్‌పి రేటింగ్స్ తో దూసుకుపోయింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ స్వదేశంలోనే జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

వారి ఎదురు చూపులకు తెరదించుతూ బి‌సి‌సి‌ఐ ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సీజన్ ఐపీఎల్ ఏప్రెల్ 9న ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఆర్సీబి, ముంబై ఇండియన్స్ మద్య జరగనుంది. ఇక మే 30న నరేంద్ర మోడి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా మ్యాచ్ లను నిర్వహించవలనిన కొన్ని గ్రౌండ్ లను ఈ సారి దూరం పెట్టింది బి‌సి‌సి‌ఐ. అందులో ముఖ్యంగా చిన్న స్వామి స్టేడియం ఒకటి. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ఎప్పుడూ బలంగా నిలిచే ఈ స్టేడియం ఈ సారి ఐపీఎల్ కు దూరమవుతుడడంతో ఆర్సీబి ట్విటర్ ద్వారా స్పందించింది. " మేము మా సొంత ఇంటిని కోల్పోతాము. జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ ఉత్సాహాన్నిఇచ్చే రెడ్ సముద్రాన్ని కోల్పోతాము. రెడ్ సర్కిల్ స్టేడియం ద్వారా అభిమానులు అంధించే ఉత్సాహాన్ని కోల్పోతాము. కానీ మేము ఎక్కడ ఆడుతున్న మీ నుంచి వచ్చే అభిమానం ఎంతో విలువైనది. అభిమానాన్ని నిలబెట్టుకొనేందుకు మేము ఎప్పుడూ కృషి చేస్తాము " అంటూ ఆర్సీభి యజమాన్యం ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చింది. కాగా ఐపీఎల్ ప్రారంభం నుడి కూడా ఇంత వరకు కప్పు గెలవలేదు. స్టార్ ఆటగాళ్లకు కొదువే లేని ఈ జట్టు కప్పు సాధించడంలో మాత్రం వెనకబడింది. దాంతో ఈసారైనా కప్పు గెలవాలని ఆర్సీబి కసితో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: