మన దేశం ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలో ఏ స్వదేశీ లీగ్ కు లేని ఆధారణ ఐపీఎల్ కు ఉంది. ఒక్క మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఐపీఎల్ పై ప్రత్యేకమైన ఆసక్తి కనబరుస్తారు క్రికెట్ అభిమానులు. ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఐపీఎల్ 14వ సీజన్ కు కూడా సిద్దమైంది. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ 14 కు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించింది బి‌సి‌సి‌ఐ. అయితే ఇదిలా ఉండగా ఐపీఎల్ జట్లలోని కొందరి ఆటగాళ్లపై ప్రతి సారి కూడా ప్రత్యేక దృష్టి పడుతుంది. అలా ఈ సారి టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పూజారా పై పడింది.

టెస్ట్ క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన ఈ ఆటగాడు దాదాపుగా పదేళ్ళ తరువాత తిరిగి ఐపీఎల్ ఆడనున్నాడు. అయితే పూజారా టెస్ట్ ప్లేయర్ అయినందున సహజంగానే ఏ జట్టు ప్రాంచైజీ కూడా పూజారాను తీసుకొనేందుకు ఆసక్తి కనబరచలేదు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం పూజారా ను కొనుగోలు చేసింది. వేలంలో ఎటువంటి పోటీ లేకుండా పూజారాను సొంతం చేసుకుంది. దీంతో సి‌ఎస్‌కే అభిమానుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఐ‌పి‌ఎల్ జట్లలోనే మేటి జట్టుగా ఉన్న సి‌ఎస్‌కే పూజారా ను కొనుగోలు చెయ్యడం ఏంటని అభిమానుల మనసులో ప్రశ్నలు తలెత్తుతునే ఉన్నాయి.

 అయితే సి‌ఎస్‌కే పక్క స్ట్రాటజీతోనే పూజారాను కొనుగోలు చేసిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ధోనితో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటానికి భారత జట్టులో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఉంటారు. చాలా సంవత్సరాల వరకు ధోని యాంకర్ ప్లేయర్ గా ఉన్నారు. కానీ ధోని 5 డౌన్ వచ్చేసరికి …అప్పటికే చాలా వికెట్లు నష్టపోతున్నారు. కాబట్టి టాప్ 3 లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కోసం చెన్నై జట్టు పూజారా ను తీసుకున్నట్లు క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి పూజారా చెన్నైకి ప్లెస్ అవుతాడో..లేక మైనస్ అవుతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: