రిషబ్ పంత్ ప్రస్తుతం టీమిండియా లో ఎంతో విలువైన ఆటగాడు. గత ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ వరకు కూడా అతడు ప్రతి మ్యాచ్ లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయాల్లో జట్టుకు అండగా నిలుస్తూ టెస్టు మ్యాచ్‌లను వన్డే, టీ20లను తలపించే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఒకప్పుడు నిలకడలేమీకి మారు పేరుగా నిలిచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ యువ సంచలనం..ప్రస్తుతం అత్యంత నిలకడగా ఆడుతూ తన బ్యాటింగ్‌ను మెరుగు పర్చుకొని భారత్‌కు అపురూప విజయాలు అందిస్తున్నాడు.

పంత్ ఒక్క బ్యాటింగ్ లోనే కాక కీపింగ్ లో కూడా తన లోపాలను సరి చేసుకోని జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే టెస్ట్ మ్యాచ్ లలో అద్బుతమైన ఫామ్ లో ఉన్న పంత్ టెస్ట్ లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగా ఇక రాబోయే టీ20 సిరీస్ కు మాత్రం గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంది.  ఎందుకంటే పొట్టి ఫార్మాట్‌లో అతడికి దీటుగా ఆడే ఆటగాడు కేఎల్‌ రాహుల్‌. టాప్‌ ఆర్డర్‌ నుంచి మిడిల్‌ ఆర్డర్‌ వరకు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న ఆటగాడు రాహుల్. అలాగే కీపింగ్ లోనూ రాహుల్ మెరుగైన ప్రదర్శనే కనబరుస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రాబోయే టీ20 సిరీస్ కొరకు తుది జట్టులో స్థానం కొరకు వీరి మద్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పంత్ అద్బుతమైన ఫామ్ లో ఉన్న కారణంగా కచ్చితంగా తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి అలాగే కొత్తగా ఇషాన్‌ కిషన్‌ అనే ముంబయి ఇండియన్స్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పొట్టి సిరీస్‌కు రెండో కీపర్‌గా ఎంపిక చేశారు. మరి పొట్టి క్రికెట్ లో తుది జట్టు లో రాహుల్, పంత్ లలో ఎవరు నిలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: