బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దేశీయ టోర్నీ అయినా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి ఎంతో ప్రత్యేకత ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభ చాటుకుని అటు బిసిసిఐ కలెక్టర్ లను ఆకర్షించి భారత జట్టులో స్థానం సంపాదించడానికి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ ఒక మంచి వేదికగా నిలుస్తోంది.  ఇప్పటికే ఎంతోమంది యువ ఆటగాళ్లు ఇలాంటి దేశీయ టోర్నీలలో  సత్తా చాటి భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించారు అనే విషయం తెలిసిందే . ఇక ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభ మైంది.


 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా బరోడా టీమ్ కెప్టెన్ కృనాల్  పాండ్య .. అదే జట్టులోని మరో ఆటగాడు దీపక్ హుడా  మధ్య ఒక వివాదం చెలరేగింది అన్న విషయం తెలిసిందే. కృనాల్  పాండ్య  ఆటగాళ్లు అందరిముందే అసభ్య పదజాలంతో దూషించాడని.. దీంతో తాను ఎంతగానో బాధ పడ్డానని అందుకే తాను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ నుంచి తప్పుకుంటున్న అంటూ దీపక్ హుడా ప్రకటించడం చర్చనీయాంశంగా మారిపోయింది.


 ఇక ఆటగాళ్ల మధ్య తలెత్తిన వివాదం పై బిసిఎ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే దీపక్ హుడా పై క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.. అంతేకాకుండా ఆటకు చెడ్డ పేరు తెచ్చే విధంగా దీపక్ హుడా వ్యవహరించాడు అని ఆగ్రహం వ్యక్తం చేసిన బి సి ఎ ఈ సీజన్  మొత్తానికి కూడా దీపక్ హుడా  పై సస్పెన్షన్ వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడంతో యువ  ఆటగాడికి భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.  ప్రస్తుతం భారత క్రికెట్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్ని  ఎంతో రసవత్తరంగా సాగుతుంది అన్న విషయం తెలిసిందే.  ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుతు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: