కరోనా  వైరస్ ప్రభావం క్రికెట్ మ్యాచ్ ల పై ఎంతగా పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా  వెలుగులోకి రావడంతో లాక్ డౌన్ అమలులోకి రావడం.. తర్వాత పూర్తిగా ఆటగాళ్ళు ఇంటికే పరిమితం కావడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కీలక నిర్ణయం తీసుకుని బయో సెక్యూర్ బబుల్ పద్ధతిలో క్రికెట్ ఆటగాళ్లు అందరిని కూడా ఐసోలేషన్ ఉంచి మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే..  పలురకాల సిరీస్ లను కూడా నిర్వహిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించడం కంటే స్టేడియం కి వెళ్లి లైవ్ లో  మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అభిమానులు.



 అయితే కరోనా  వైరస్ కారణంగా నిలిచిపోయిన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ గత ఏడాది ప్రారంభం అయిన ఐపీఎల్ ద్వారానే ప్రారంభం అయినప్పటికీ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా స్టేడియంలోకి అనుమతి లేకపోవడంతో అందరూ ఎంతో నిరాశ చెందారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక టీవీ  ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించారు.  ఇక ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన పూర్తిచేసుకొని స్వదేశం చేరుకున్న టీమిండియా త్వరలో ఇంగ్లండ్ జట్టుతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రేక్షకులందరూ స్టేడియం కి వెళ్లి మ్యాచ్ వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మళ్ళీటీమిండియా అభిమానులకు నిరాశే ఎదురు కానున్నట్లు తెలుస్తోంది.



 సుదీర్ఘ విరామం తర్వాత స్టేడియంలో మ్యాచ్ చూడాలి అని అనుకుంటున్న టీమిండియా అభిమానులకు ఇక మరిన్ని రోజులు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. టీం ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా రెండు టెస్ట్ మ్యాచ్ లు  జరగనున్నాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఈ టెస్ట్ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యుడు తెలిపారు అయితే ముందు జాగ్రత్త చర్యలు లో భాగంగానే ఇలా బీసీసీఐ  నిర్ణయించిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: