ఐపీఎల్ 14 వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండవ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నిన్న హైదరబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తో స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ దాదాపుగా ఐదేళ్ల తరువాత ఐపీఎల్ లో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. పెద్దగా అనుకూలించని పిచ్‌పై 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 పరుగులతో ఆకట్టుకున్నాడు.  2016, మే4 తేదీన కింగ్స్‌ పంజాబ్‌ తరఫున మ్యాక్సీ 42 బంతుల్లో 68 పరుగులతో అర్ధ శతకం చేసిన మాక్సీ మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఆర్సీబీ తరుపున అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

 మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ చేయడానికి 1,806 పట్టింది. ఇక మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లోకి రావడంతో ఆర్సీబీ మురిసిపోతోంది.   అయితే గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మాక్స్ వెల్ పైన ఎన్నో ఆశలు పెట్టుకుని అతని ద్వారా వరుస వైఫల్యాలను చవి చూసింది. దీంతో ఈ సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ మాక్సీ ని విడిచి పెట్టింది. దీంతో అతన్ని 14 కోట్ల 25 లక్షల భారీ ధర వెచ్చించి మరీ ఆర్సీబీ  కొనుగోలు చేసింది.

అయితే మొదట్లో మాక్స్ వెల్ ను అంతా భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చెయ్యడంపై ఆర్సీబీ యజమాన్యం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి.. అయినప్పటికి ఆర్సీబీ యజమాన్యం మాక్సీ పై నమ్మకం ఉంచింది. ఇక తాజాగా జరిగిన మ్యాచ్ తో వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు మ్యాక్స్ వెల్. మరి ఈ ఏడాది టైటిల్ ఎలాగైనా సాధించాలని కసిగా ఉన్న ఆర్సీబీ కి మాక్స్ వెల్ ఫామ్ లోకి రావడం అత్యంత సానుకూలాంశం..మరి మ్యాక్స్ వెల్ ఇదే ఫామ్ ను సీజన్ మొత్తం కొనసాగించి టైటిల్ విజయంలో కీలక పాత్ర వహిస్తాడా లేక మళ్ళీ ఫామ్ కోల్పోయి నిరుత్సాహ పరుస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: