గత కొన్ని రోజుల నుంచి భారత జట్టుకు కెప్టెన్సీ మార్పు పై తీవ్రమైన చర్చ జరుగుతుంది. భారత జట్టుకు సమర్ధుడైన కెప్టెన్ ఎవరు అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణించి జట్టును ఎంతో సమన్వయంతో ముందుకు నడిపించిన రోహిత్ శర్మ భారత జట్టు వన్డే టి20 లకు కెప్టెన్ గా మారితే బాగుంటుందని విరాట్ కోహ్లీ ని కేవలం టెస్ట్ లకు మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది అంటూ డిమాండ్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే ఇక ఈ విషయంలో అటు దిగ్గజ క్రికెటర్ సైతం స్పందించి కెప్టెన్సీ విభజన వల్ల ఆటగాళ్ల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.


 అంతేకాకుండా దీనిపై స్పందించిన బీసీసీఐ కూడా ఇప్పట్లో విరాట్ కోహ్లీ ని కెప్టెన్గా తొలగించే ఆలోచన లేదు అంటూ స్పష్టం చేసింది అయినప్పటికీ అటు సోషల్ మీడియాలో మాత్రం భారత జట్టుకు కెప్టెన్సీ మార్పులకు సంబంధించి చర్చ గట్టిగానే జరిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే మరోసారి ఇలాంటి చర్చ తెరమీదికి వచ్చింది. టి20 ఫార్మాట్లో ఎవరు సమర్థుడైన కెప్టెన్ అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓడిపోయే మ్యాచ్లో సైతం గెలుపు తీరాల వైపు నడిపించాడు. తనదైన వ్యూహాలతో జట్టుకు విజయం అందించి ప్రశంసలు అందుకున్నారు.



 అయితే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడగా కేవలం 149 పరుగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ క్రమంలోనే ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కోహ్లీ తన వ్యూహాలకు పదును పెట్టి ఓడిపోయే మ్యాచ్ను కూడా గెలుపు తీరాల వైపు నడిపించాడు.  ఈ క్రమంలోనే ఎంతో అలవోకగా ఓడిపోయే మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచింది అయితే ఇలా ఇద్దరు కెప్టెన్స్ కూడా ఎంతో వ్యూహాత్మకంగా జట్టు గెలుపు అందించడంతో మరోసారి బెస్ట్ కెప్టెన్ ఎవరు అన్న దానిపై చర్చ మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: