ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్ పృథ్వీ షా ప్రాచి సింగ్‌ అనే అమ్మాయితో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కొంతకాలంగా పృథ్వీ, ప్రాచిలు పీకల్లోతూ ప్రేమలో మునిగితేలుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ప్రత్యక్షమయ్యాయి.

తాజాగా ప్రాచి బెల్లీ డ్యాన్స్‌తో అదరగొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ప్రాచి బెల్లీ డ్యాన్స్‌తో తనలోని డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ను వీలైతే ఒకసారి చూడండి. దేశంలో కరోనా విజృంభిస్తున్నవేళ మీకు ఉపశమనం కలిగించడానికి బెల్లీ ట్రై చేశా.. చూసి ఎలా ఉందో చెప్పండి'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాచి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.



అయితే పృథ్వీ షా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 308 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో 6 బౌండరీలు బాదాడు. ఈ తరుణంలోనే 41 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఐపీఎల్ టోర్నీలో అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో ఆరు బౌండరీలు బాదిన ఘనతను తన పేరుపై లికించుకున్నాడు.



అంతేకాదు.. కోల్‌కతా మ్యాచ్‌లో పృథ్వీ షా ఏకంగా ఐదు అవార్డులు గెలుచుకున్నాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు, సఫారీ సూపర్‌ స్టైకర్‌, , గేమ్‌ ఛేంజర్‌, క్రెడ్‌ పవర్‌ ప్లేయర్‌, అప్‌స్టాక్స్‌ మోస్ట్‌ వాల్యూబుల్‌ అసెట్‌ అవార్డులు షా గెలుచుకున్నాడు. దీంతో ప్రాచి సింగ్‌ అభినందనలు తెలుపుతూ ఓ సెటైర్ వేసింది. షా అందుకున్న అవార్డులన్నింటినీ కలిపి ఒక ఫోటోలో జత చేసిన ప్రాచి.. 'ఆ అవార్డులు అన్ని తీసుకెళ్లడానికి కొత్త సూట్‌ కేసు కావాలేమో' అని కామెంట్‌ చేశారు. ప్రాచి తరచూ తన వర్కవుట్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: