ప్రస్తుతం క్రికెట్లో టెస్ట్ వన్డే లాంటి ఫార్మాట్లు ఉన్నప్పటికీ టి20 ఫార్మాట్కు మాత్రం యమ క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే టి20 ఫార్మాట్లో ఆటగాళ్లు ఎప్పుడు సిక్సర్లు బాదుతారా అని వేచి చూడాల్సిన పనిలేదు.. స్కోర్ ఎప్పుడు పెరుగుతుందా అనే నిరీక్షించాల్సినా అవసరమే లేదు..  అంతేకాకుండా ఎప్పుడు వికెట్ పడుతుందా అని ఎదురు చూడాల్సిన పనిలేదు ఎందుకంటే టీ-20 ఫార్మెట్లో బంతి బంతికి మ్యాచ్ స్వరూపం మారిపోతు ఉంటుంది. టి20 ఫార్మాట్  మొత్తం ధన ధన పాట ఫస్ట్ అనే విధంగా ఉంటుంది. కేవలం మూడు గంటల్లోనే మ్యాచ్ ఫలితం ఏమిటో తేలిపోతుందని.. అందుకే క్రికెట్ ప్రేక్షకులందరూ టీ20 ఫార్మాట్  అంటే తెగ ఇష్టపడుతూ ఉంటారు.



 అంతేకాదు టి20 ఫార్మాట్లో ఆటగాళ్లందరూ కూడా ఎంతో దూకుడుగా ఆడుతూ ఉంటారు ప్రతి బంతిని బౌండరీ ఎలా చేర్చాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇక టీ-20 ఫార్మెట్లో ఏ మ్యాచ్ చూసినా కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూనే ఉంటుంది. ఆటగాళ్ల ప్రదర్శన కు 20 ఫార్మాట్ ఒక సవాల్ లాంటిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీ20 ఫార్మాట్ వచ్చిన కొత్తలో బిసిసిఐ విముఖత చూపించింది. కానీ ఆ తర్వాత టి20 ఫార్మాట్ యొక్క మజా అర్థం చేసుకొని 2006లో డిసెంబర్లో తొలి టీ-20 మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడింది భారత్. ఇలా 2006 నుంచి టి20 క్రికెట్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టింది టీమిండియా



 అయితే 2006 నుంచి టి20 ఫార్మాట్ భారత క్రికెటర్లు ఆడినప్పటికీ అంతకు ముందు నుంచే ఒక భారత క్రికెటర్ మాత్రం టి20 క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు  టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేష్ మంగియా 2004లో లాంకాషాయిర్ జట్టు తరఫున టి20 క్రికెట్ ఆడాడు. ఇలా టి20 ఫార్మాట్ లో క్రికెట్ ఆడిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు 2006లో టీమ్ ఇండియా ఆడిన అంతర్జాతీయ జట్టులో కూడా దినేష్  స్థానం దక్కించుకోవడం గమనార్హం. అంతేకాకుండా దినేష్ కు అదే తొలి చివరి టి20 మ్యాచ్ కూడా కావడం గమనార్హం.  బీసీసీఐ నిషేధించిన ఒక లీగ్లో ఇక దినేష్ ఆడటంతో చివరికి అతనికి భారత జట్టులో స్థానం దక్కటం కష్టంగా మారిపోయింది అతని కెరీర్ ముగిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: