సాధారణంగా ప్రతి ఒక్క క్రికెట్ ఆటగాడికి టీమిండియా అంతర్ జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడం ఒక కళ. అయితే ఇక ఛాన్స్ వస్తే ఏకంగా ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం అనేది ఒక లైఫ్ ఆంబినేషన్ గా ఉంటుంది.ప్రతి ఒక్క ఆటగాడికి కూడా ఇలాంటి కోరిక ఉంటుంది  కానీ కొంతమందికే ఇలా కెప్టెన్ అయ్యే అవకాశం వస్తూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న కారణాల కారణంగా ఏకంగా ఇలాంటి అసాధారణమైన అవకాశాలు చేజారిపోతున్నాయి ఇక ప్రస్తుతం టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది.




 శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే తాను ఒక విజయవంతమైన సారధిని అని ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ వహించి నిరూపించుకున్నాడు. గతేడాది ఎంతో అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాడు అంతేకాదు ఫ్యూచర్ కెప్టెన్ అంటూ ఎంతో మంది ప్రశంసలు కురిపించారు.  ఇక అందరూ అనుకున్నట్లు గానే ఇటీవలే శ్రేయస్ అయ్యర్ ఏకంగా టీమిండియా కెప్టెన్ అయ్యే చాన్స్ వచ్చింది  కానీ అతని అదృష్టం బాగా లేనట్లుంది వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శ్రేయస్ అయ్యర్ భుజం గాయం బారిన పడ్డాడు.



 ఇక ఆ తర్వాత ఐపీఎల్ లో కూడా అందుబాటులో లేడు దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి కెప్టెన్గా పంత్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా జట్టు ఇంగ్లాండ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడేందుకు వెళ్ళింది.  ఇక అదే సమయంలో శ్రీలంక టి20 వన్డే సిరీస్ లు ఆడేందుకు అటు బీసీసీఐ మరో కొత్త జట్టును సిద్ధం చేసింది ఇక మొదటి సారి ఇలా రెండు జట్లతో రెండు దేశాలతో తలపడేందుకు సిద్ధమైంది టీమిండియా. ఈ క్రమంలోనే శ్రీలంకకు వెళ్లబోయే జుట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ కావడం ఖాయం అని అనుకున్నారు కానీ భుజం గాయం నుంచి ఇప్పటికీ శ్రేయస్ అయ్యర్ కోలుకోక పోవడంతో చివరికి శిఖర్ ధావన్  కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: