క్రికెటర్లకు, సినీ హీరోయిన్స్ కు మద్య ప్రేమాయణాలు గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, హర్ధిక్ పాండ్య, కె ఎల్ రాహుల్ వంటి స్టార్ క్రికెటర్లు గతంలో పలువురు హీరోయిన్స్ తో ప్రేమ పాఠాలు వల్లించినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నాయి. ఇక ఐపీఎల్ ద్వారా సత్తా చాటుతున్న యువ క్రికెటర్లు కూడా పలువురు తరాలతో ఎఫ్ఫైర్స్ కొనసాగిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాక అందమైన బామాల మనసులు దోచుకోవడంలో కూడా యువ క్రికెటర్లు ముందే ఉన్నారు.

ఇటీవల పృథ్వీ షా, గిల్ వంటి యువ క్రికెటర్లకు సంబంధించిన ఎఫ్ఫైర్స్ బయట పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ అయిన రుతు రాజ్ గైక్వాడ్ ఓ మరాఠి బ్యూటీ తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు అనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్ర లోని నాసిక్ చెందిన సయాలి సంజీవ్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక వీరిద్దరి మద్య ఇటీవల జరిగిన ఇన్స్టా గ్రామ్ చాట్ తో ఆ వార్తలకు మరింత బలం చేకుతుంది.

 ఐపీఎల్ జరుగుతున్న సమయంలో సయాలి ఇన్ స్టా పెట్టిన పోటోకి రుతు రాజ్ వావ్ అని కామెంట్ చేసి హార్ట్ సింబల్ జతచెయ్యగా, దానికి సమాధానంగా సయాలి వాహ్ వా అంటూ డబుల్ హర్ట్స్ జత చేసింది. ఇక వీరిద్దరి చాట్ చూసిన నెటిజన్స్ సంథింగ్.. సంథింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.   ఇక సయాలి పలు మరాఠి టీవి సిరియల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు మెన్ లీడ్ లో నటించిన "కహే దియా పార్దేస్ ", " పర్ఫెక్ట్ పతి " వంటి సిరియల్స్ మంచి ఆదరణ పొందాయి. ఇక కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో క్రికెటర్స్ అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: