సాధారణంగా  భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ప్రతి ఒక ఆటగాడు ఎంతగానో ఆశ పడుతూ ఉంటాడు. అయితే భారత జట్టులో స్థానం సంపాదించడమే కాదు అటు ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం లిఖించు కోవాలి  అనుకుంటూ ఉంటారూ.  కాగా అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతంగా రాణించిన వారికి కొన్ని కొన్ని సార్లు ఐసీసీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తూ ఉంటుంది.  ఏకంగా ఆటగాడికి సంబంధించిన ఫోటోలను రికార్డులను  కూడా ఐసీసీ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం చేస్తూ ఉంటుంది.



 ఇలాంటి సమయంలోనే అటు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ పేరుతో కొంత మంది ఆటగాళ్లకు ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఇస్తూ ఉంటుంది. అయితే ఇలా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో స్థానం సంపాదించుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు కోరుకుంటూ ఉంటాడు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ జరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో పలువురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.  ఐదు దేశాలకు చెందిన పది మంది ఆటగాళ్లను ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చింది.

 ప్రతి తరంలో ఇద్దరిని సెలెక్ట్ చేసి హాల్ ఆఫ్ ఫేమ్ లో అరుదైన గౌరవం ఇచ్చింది ఐసీసీ. అయితే  ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత దిగ్గజ ఆటగాడు విను మన్కడ్ కూడా చోటు దక్కించుకోవడం గమనార్హం. ఇక ఈ హాల్ ఆఫ్ ఫేమ్ ఫోటోలనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐసీసీ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ పది మంది పాత్ర ఎంతో కీలకమైనది అంటూ చెప్పుకొచ్చింది.  ఇక వీరి చేరికతో హాల్ ఆఫ్ ఫేం సంఖ్య 103కు చేరింది అంటూ ఐసీసీకి తెలిపింది. భారత దిగ్గజ ఆటగాడు అయిన వినూ మన్కాడ్ కి హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కడం తో అటు బీసీసీఐ  సంతోషం వ్యక్తం చేసింది.



 అయితే ఎడమ చేతి వాటం స్పిన్నర్ అయినా వినూ మన్ కాడ్ భారత జట్టు తరఫున నలభై నాలుగు టెస్టుల్లో 2109 పరుగులు చేశాడు  ఓవైపు జట్టులో కీలక ఎడమచేతి స్పిన్నర్ గా..  మరోవైపు ఓపెనర్గా అద్భుతంగా రాణించాడు మన్ కాడ్. టెస్టుల్లో 162 వికెట్లు పడగొట్టాడు.  ఇక భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాడికి అరుదైన గౌరవం ఇస్తూ బీసిసిఐ వినూ మన్ కాడ్ పేరిట ఒక ప్రత్యేకమైన దేశవాళీ టోర్నీ కూడా నిర్వహిస్తోంది. ప్రస్తుతం క్రికెట్ లో ఉన్న మన్కడింగ్ రూల్ ఈయన ద్వారానే వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: