తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభ గల  క్రీడాకారులను గుర్తించేందుకు ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైంది. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎన్నో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఇక ఈ కొత్త జిల్లాలు తెలంగాణ క్రికెట్ కౌన్సిల్ సభ్యత్వం పొందలేదు. ఈ క్రమంలోనే ఇక ఆ కొత్త జిల్లాలో ఉన్న ఎంతోమంది ప్రతిభగల క్రీడాకారులను చివరికి ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చోటు దక్కటం లేదు. అయితే ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.



 తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కొత్త జిల్లాల నుంచి  ఆరుగురు సభ్యులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో నియమించారు అధ్యక్షుడు అజారుద్దీన్. రాష్ట్రంలో క్రికెట్ క్రీడను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ఎంతోమంది క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ముందు ఉంటుంది అని తెలిపారు. ఇక తెలంగాణలో పెరిగిన జిల్లాల కు అనుగుణంగా హెచ్సీఏ సభ్యుల సంఖ్యను పెంచి ఇక అన్ని జిల్లాలో యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాం అన్నారు అజారుద్దీన్ .



 శరత్ చంద్ర, మఠం బిక్షపతి, బుద్ధుల శ్రావణ్ రెడ్డి, దాదాన్నగారి సందీప్ కుమార్, దాబా సురేష్, కల్లుకుంట మల్లికార్జున్ లను హెచ్సిఎ లో సభ్యులుగా చేరుస్తూ అజారుద్దీన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇక వీరిని జిల్లాల్లో అడ్ హక్ కార్యదర్శిలుగా నియమిస్తూ  అపెక్స్ కౌన్సిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఎన్నికైన సభ్యులు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను నియమించి ప్రతిభగల క్రీడాకారులను వెలికి తీయానున్నారు. అంతే కాదు మారుమూల గ్రామాల్లో ఉండే యువతుకు సైతం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారి నైపుణ్యాలను పెంచేందుకు ఎంతగానో కృషి చేయనున్నారు కొత్తగా ఎన్నికైన సభ్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Hca