ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖాత్ జ‌రీన్‌ను ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత అభినందించారు. నిఖాత్ జ‌రీన్ ప్ర‌తిభ‌ను గుర్తించి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ ఆఫీస‌ర్ ఉద్యోగం క‌ల్పించింది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ని ఎమ్మెల్సీ క‌విత‌ను క‌లిశారు.నిజామాబాద్‌కి చెందిన నిఖాత్  జ‌రీన్ బాక్సింగ్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ నిఖాత్  జ‌రీన్ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని ఆంకాంక్షించారు.ఎంతో క‌ష్ట‌ప‌డి బాక్సింగ్‌లో ప్ర‌పంచ‌స్థాయికి ఎదిగిన నిఖాత్ జ‌రీన్ యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు.నిఖాత్  జ‌రీన్‌ను క్రీడ‌ల‌వైపు ప్రోత్స‌హించింన త‌ల్లిదండ్రులు ప‌ర్వీన్‌,జ‌మీల్‌ల‌ను క‌విత అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే బిగాల గ‌ణేష్ గుప్త‌, శాట్స్ ఛైర్మ‌న్ అల్లీపురం వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి పాల్గొన్నారు.
నిఖాత్  జ‌రీన్ టోక్యో ఒలంపిక్స్‌లో పాల్గొన్నాలని అనుకున్నప్ప‌టికి 2019 లో న్యూఢిల్లీలో జ‌రిగిన ఒలంపిక్ క్వాలిఫ‌య‌ర్స్‌లో దిగ్గ‌జ బాక్స‌ర్ మేరీ కోమ్‌పై ఓట‌మిపాలైయ్యారు. నికాత్ జ‌రీన్  విశాఖ‌ప‌ట్నంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 2009లో ద్రోణాచార్య అవార్డు గ్ర‌హీత ఐవీ రావు ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ‌ను ప్రారంభించారు.ఆ త‌రువాత ఆమె తండ్రి మ‌హ‌మ్మ‌ద్ జ‌మీల్ అహ్మ‌ద్ నిఖాత్‌ని మ‌రింత ప్రోత్స‌హించారు.2011లో ట‌ర్కీలోని అంటాల్యాలో జ‌రిగిన ఏఐబీఏ ఉమెన్స్ జూనియ‌ర్ ఛాంపియ‌న్‌షిప్‌లో గోల్డ్‌మెడ‌ల్ సాధించింది.గౌహ‌టిలో జ‌రిగిన రెండ‌వ ఇండియా ఓపెన్ అంత‌ర్జాతీయ బాక్సింగ్ టోర్న‌మెంట్‌లో కాంస్య ప‌త‌కాన్ని,2019 థాయిలాండ్‌లో జ‌రిగిన ఓపెన్ అంత‌ర్జాతీయ బాక్సింగ్ టోర్న‌మెంట్‌లో ర‌జ‌త ప‌త‌కాన్ని సాధించింది.2015లో బ్యాంకాంక్‌,అస్సాంలో జ‌రిగిన ఛాంపియ‌న్‌షిప్‌లో బంగారు ప‌త‌కం సాధించింన‌ప్పుడు ఆమె త‌న మొద‌టి జాతీయ సీనియ‌ర్ టైలిల్‌ని గెలుచుకుంది.
తెలంగాణ ప్రాంతానికి చెందిన నిఖాత్ జ‌రీన్ త‌న అద్భుత‌మైన ప్ర‌తిభ‌తో దేశానికి మంచిపేరు తీసుకువ‌స్తుంది.చిన్న‌ప్ప‌టి నుంచే నిఖాత్ క్రీడ‌ల‌పై ఆస‌క్తి ఎక్కువ ఉండేది.ఆ మ‌క్కువ‌తోనే ఆమె బాక్సింగ్ వైపు వెళ్లింది.బాక్సింగ్‌లో త‌న‌దైన ముద్ర వేసుకుంది.ఒలంపిక్స్‌లో మెడ‌ల్ సాధించ‌డ‌మే త‌న లక్ష్యంగా నిఖాత్ దృష్టిసారిస్తుంది.అయితే త‌న‌కు ఆర్థికంగా భ‌రోసా ఇచ్చేంద‌కు త‌న ప్ర‌తిభ‌ను గుర్తించి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఇవ్వ‌డం అభినంద‌నీయం.

మరింత సమాచారం తెలుసుకోండి: