టీమిండియా ప్లేయర్స్ లలో "రవీంద్ర జడేజా" కు మంచి గుర్తింపు ఉంది. ఇక అంతే కాకుండా జడేజా క్రికెట్ లో ఆల్రౌండర్ గా పేరొందాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్,బ్యాటింగ్ తో తనదైన శైలిలో ఆడి టీమిండియా ని ముందుకు నడిపిస్తున్నారు. ఇక రవీంద్ర జడేజా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు.అదేమిటో చూద్దాం.



జడేజా పూర్తి పేరు "రవీంద్రసింత్ అనిరుద్సింగ్ జడేజా" . ఇక తన తండ్రి పేరు "అనిరుద్సింగ్ జడేజా". ఈయన ఒక ప్రైవేటు ఆఫీస్ ముందు వాచ్మెన్ గా పని చేసేవారు. తల్లి పేరు"లత జడేజా" . ఈమె ఒక హాస్పిటల్లో నర్సుగా పని చేసేవారు. జడేజాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఇక "మహేంద్ర సింగ్ చౌహాన్"అని ఒక పోలీస్ అధికారి. జడేజా జీవితాన్ని మార్చేశాడు.
ఇక 2016లో జడేజా ఏప్రిల్ 17వ తేదీన"రివాబా" అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక వీరిద్దరికీ 2017వ సంవత్సరంలో "నిద్వానా "అనే కూతురు పుట్టింది. తన కూతురు పుట్టినరోజు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా, ఏదైనా ఆర్థిక సాయం చేయాలని జడేజా దంపతులు ఆలోచిస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే నిద్వానా పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబంలో జన్మించిన పదివేల మంది అమ్మాయిలకు అండగా నిలవాలని పుట్టినరోజు సందర్భంగా వారు నిర్ణయం తీసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సహాకారం తో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలను వారి ఖాతాలోకి చేర్చినట్లు సమాచారం.
జడేజా ఆటలోనే కాకుండా, ఇలా వ్యక్తిగతంగా కూడా సహాయం చేయడం గమనార్హం. దీనంతటికి కారణం తన భార్య అని అంటున్నారు స్నేహితులు. తన భార్య వచ్చినప్పటినుంచి జడేజా లో చాలా మార్పులు వచ్చాయి అని చెబుతున్నారు. ఇక తన భార్య"భారతీయ జనతా పార్టీలో" చేరిన విషయం మనకు తెలిసిందే. ఇక 2021 సీజన్లో IPL లో CSK తరపున ఆడుతూ అదిరిపోయే ఫర్ఫార్మెన్స్ ను ఇచ్చారు.

ఇలాంటి సహాయాలు జడేజానే కాకుండా టీమిండియా లోని ఆటగాళ్లు కూడా చేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా జడేజా ఇలా చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ఒక తండ్రిగా తన కూతురు మీద ఎంత ప్రేమ ఉందో జడేజా నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: