ఒలింపిక్‌ క్రీడల్లో భారతకు పతక అవకాశాలుండే క్రీడలు శనివారం నుంచి జరుగబోతున్నాయి. నేడు జరిగే పోటీల్లో పురుషుల సింగిల్స్‌లో బి.సాయి ప్రణీతతో పాటు డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే డబుల్స్‌ జోడీకి క్లిష్టమైన డ్రా పడింది.

షూటింగ్‌: ఉదయం 5 గంటలకు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల అర్హత పోటీల్లో ఎలెవెనిల్‌ వలరివన-అపూర్వీ చండీలా.
ఆర్చరీ: ఉదయం 6 గంటలకు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఎలిమినేషన పోటీల్లో దీపికా కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ.
హాకీ: పురుషుల హాకీ పూల్‌-ఎ లో న్యూజిలాండ్‌తో భారత ఢీ.
షూటింగ్‌: ఉదయం 7.15 గంటలకు 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల ఫైనల్‌.
రోయింగ్‌: ఉదయం 7.30 గంటలకు లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్‌ హీట్స్‌లో అర్జున లాల్‌-అరివింద్‌ సింగ్‌.
జూడో: ఉదయం 7.30 గంటలకు మహిళల 48 కిలోల ఎలిమినేషనలో సుశీలా దేవి.
టేబుల్‌ టెన్నిస్‌: ఉదయం 8.30 గంటలకు మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో శరత కమల్‌-మనికా బాత్రా జోడీ.
బ్యాడ్మింటన: ఉదయం 8.50 గంటలకు పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి.
టెన్నిస్‌: ఉదయం 9 గంటలకు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సుమిత నగాల్‌.
బ్యాడ్మింటన: ఉదయం 9.30 గంటలకు పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సాయి ప్రణీత.
షూటింగ్‌: ఉదయం 9.30 గంటలకు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ అర్హత పోటీల్లో సౌరభ్‌ చౌధరి, అభిషేక్‌ వర్మ.
వెయిట్‌ లిఫ్టింగ్‌: ఉదయం 10.20 గంటలకు మహిళల 49 కిలోల ఫైనల్‌లో మీరాబాయ్‌ చాను.
షూటింగ్‌: మధ్యాహ్నం 12.00 గంటలకు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌.
టేబుల్‌ టెన్నిస్‌: మధ్యాహ్నం 12.15 మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మనికా బాత్రా
టేబుల్‌ టెన్నిస్‌: మధ్యాహ్నం 01.00 గంటకు మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సుత్రితా ముఖర్జీ.
బాక్సింగ్‌: మధ్యాహ్నం 03.54 గంటలకు పురుషుల 69 కిలోల తొలి రౌండ్‌లో వికాస్‌ కృష్ణన.
హాకీ: సాయంత్రం 5.15 గంటలకు మహిళల హాకీ పూల్‌-ఎ లో నెదర్లాండ్స్‌తో భారత ఢీ.


ReplyForward










మరింత సమాచారం తెలుసుకోండి: