మీరాబాయి చాను.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. ఒలంపిక్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన పేరు.  అప్పుడెప్పుడో జరిగిన రియో ఒలింపిక్స్ లో భారత్ తరఫున అందరిని నిరాశపరిచి అపఖ్యాతిని మూటగట్టుకున్న మీరబాయ్ చాను ఇక ఇప్పుడు భారత ప్రజలు అందరూ కూడా గర్వపడేలా చేసిన రోజు ఈ రోజు. ఇటీవలే ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ శుభారంభం చేసింది. ఇటీవలే భారత్ కి తొలి పథకం అందించింది మీరాబాయి చాను. వెయిట్ లిఫ్టింగ్ లో ఎనలేని ప్రతిభ కనబరిచిన మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో అడుగు దూరంలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. కానీ భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర లేపింది. ఏకంగా రజత పతకం సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది మీరాబాయి చాను.



 క్లీన్ అండ్ జెర్క్ లో 115 కేజీల బరువు ఎత్తిన మీరబాయ్ చాను మొత్తం మీద రెండు వందల రెండు కేజీల వరకు బరువు ఎత్తింది. కానీ స్వర్ణం కోసం జరిగిన మూడవ రౌండ్ లో మాత్రం మీరాబాయి చాను కాస్త తడబడింది. దీంతో స్వర్ణానికి అడుగు దూరంలో ఆగిపోయింది  దీంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది   అయినప్పటికీ ఇప్పటి వరకు వెయిట్ లిఫ్టింగ్ లో రెండు వేల సంవత్సరంలో కరణం మల్లేశ్వరి తర్వాత ఇప్పటివరకు ఎవరూ కూడా పథకం తీసుకురాలేదు. అప్పుడు కరణం మల్లేశ్వరి కాంస్య పతకం సాధిస్తే ఇక ఇప్పుడు మీరబాయ్ చాను ఏకంగా రజత పతకం సాధించింది  రజత పతకం సాధించిన సందర్భంగా మీరాబాయి చాను ఎమోషనల్ అయ్యారు  రియో ఒలంపిక్స్ లో విఫలం అయిన తర్వాత ఎంతగానో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చారు


 ఆ తర్వాత జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ తరఫున ఏకంగా బంగారు పతకం సాధించాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒలింపిక్స్ లో బంగారు  పతకం సాధించాలని ఇక ఎన్నో ఏళ్ల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నానని.. అయితే నేడు రజక పథకం సాధించినప్పటికీ బంగారు పతకం గెలవలేక పోయాను అన్న వెళితీ ఉందని కానీ సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. నేడు సాధించిన పథకం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు మీరాబాయి చాను. ప్రస్తుతం నేను సాధించిన రజత పతకం నా జీవితంలో నేను చేసిన త్యాగాల ఫలితమే అంటూ ఎమోషనల్ అయ్యారు మీరబాయ్ చాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు కాస్త కడుపునొప్పి ఉండేదని కానీ ఇప్పుడు పతకం గెలిచిన తర్వాత అదంతా పోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించాలని ఎన్నో కలలు కన్నాను మీరాబాయి చాను తెలిపారు. ప్రస్తుతం భారత్ తరఫున రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు మీరాబాయి చాను.

మరింత సమాచారం తెలుసుకోండి: