ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలంపిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నుంచి క్రీడాకారులు ఒలంపిక్ లో పాల్గొనడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక ఒలంపిక్స్ జరుగుతున్న సమయంలో పూర్తిగా ప్రేక్షకులు అందరూ కూడా తమ దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు  మద్దతు ప్రకటిస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఒలంపిక్స్ మొదలయింది అంటే చాలు మొత్తం కోలాహలంగా మారిపోతూ ఉంటుంది. అయితే  గత ఏడాది టోక్యో ఒలంపిక్స్ జరగాల్సి ఉంది.


 కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఒలంపిక్ నిర్వహించాలని ఇక జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అన్ని దేశాల నుంచి క్రీడాకారులు వారికి సంబంధించిన కోచ్ లు సిబ్బంది కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కరోనా వైరస్ బారిన పడకుండా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కఠిన నిబంధనల మధ్య ప్రేక్షకులు లేకుండానే ఒలంపిక్ నిర్వహిస్తుంది. అంతేకాదు టోక్యో నగరంలో ఎమర్జెన్సీ విధించింది జపాన్ ప్రభుత్వం.  ఇలా కరోనా వైరస్ ప్రభావం ఒలంపిక్స్ ఫై పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది.



 కానీ కరోనా వైరస్ మాత్రం పట్టు విడువనట్టు గానే కనిపిస్తోంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్రీడల గ్రామంపై పంజా విసురుతుంది. క్రమక్రమంగా ఒలంపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు వారి సిబ్బంది లేదా కోచ్లు ఇక వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ గ్రామం లో మరో 16 మంది క్రీడాకారులకు కరోనా వైరస్ సోకింది. ఇలా కరోనా వైరస్ బారిన పడిన వారిలో ముగ్గురు విదేశీ అథ్లెట్లు ఉన్నారు అని నిర్వాహకులు వెల్లడించారు. కరోనా వైరస్ బారిన పడిన క్రీడాకారులను  కూడా బయటకు పంపించి.. క్వారంటైన్ లో   ఉంచారు కాగా ఇప్పటివరకు 148 మంది ఒలంపిక్ గ్రామంలో  వైరస్ బారిన పడ్డారు. అయితే 13 విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా వైరస్ బారిన పడటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: