నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే క్రీడల పండుగ టోక్యో ఒలింపిక్స్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలనుంచి ఎంతో మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇక ఒలింపిక్స్లో పతకం గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు ఎంతో మంది క్రీడాకారులు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాలు బంగారు వెండి, కాంస్య పథకాలు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ క్రీడాకారుడు పట్టుదలను వీడకుండా  ఒలంపిక్స్  లో పాల్గొంటున్నారు. తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.


 ఇక ఒకప్పుడైతే కరోనా వైరస్ ప్రభావం లేదు కాబట్టి ప్రేక్షకులు సందడి మధ్య టోక్యో ఒలంపిక్స్ నిర్వహించేవారు. ఈ క్రమంలోనే  ప్రేక్షకులు మద్దతుతో క్రీడాకారుల్లో కూడా మరింత ఉత్సాహం నిండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్ జరిగిపోతున్నాయి. దీంతో ఎంతో మంది క్రీడాకారులు కాస్త ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటికే ఓవైపు కరోనా వైరస్ ని ఇబ్బంది పెడుతుంటే ఇక జపాన్లోని వాతావరణ పరిస్థితులు కూడా క్రీడాకారులను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా జపాన్ లో ఎండలు దంచికొడుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఇటీవల టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న ఒక టెన్నిస్ స్టార్ తీవ్ర అవస్థలు పడ్డాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎన్నో సార్లు విరామం తీసుకున్నాడు. టెన్నిస్ స్టార్ డానియల్ మెద్వదేవ్ ఇక రెండు సార్లు వైద్యుల నుంచి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ గా ఉన్న వ్యక్తి మీరు మ్యాచ్ కొనసాగిస్తున్నారా అంటూ ఆ టెన్నిస్ స్టార్ ని అడిగాడు. కొనసాగిస్తాను కానీ ఉక్కపోత తట్టుకోలేక చనిపోతాను చనిపోతే మీరు రెస్పాన్సిబులిటీ వహిస్తారా అంటూ ప్రశ్నించాడు ఆ టెన్నిస్ స్టార్. ఇలా ఎంతో ఇబ్బందులు పడుతూనే మ్యాచ్ ఆడిన ఈ రష్యన్ ప్లేయర్ చివరికి మ్యాచ్లో విజయం సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: