భారత్ శ్రీలంక మధ్య నేడు మూడవ టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే మూడవ టి20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఎందుకు అంటే ఇక టీ20 సిరీస్ లో భాగంగా మొదట అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు ఘన విజయం సాధించింది..  ఈ క్రమంలోనే ఇక రెండో టి20 మ్యాచ్ కూడా భారత జట్టు కైవసం చేసుకొని మరోసారి  వన్డేలో సిరీస్  సీన్ రిపీట్ చేస్తుంది అని అనుకున్నారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంటుంది అని అనుకున్నారు అందరు. కానీ శ్రీలంక జట్టు మాత్రం సొంత గడ్డపై పరువు నిలబెట్టుకోవడానికి పట్టుదలతో పోరాడింది.


 ఇప్పటికే వన్డే సిరీస్లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ భారత్ కు కట్టబెట్టింది శ్రీలంక జట్టు. ఇక ఆ తర్వాత నామమాత్రపు మ్యాచ్ అయిన మూడవ వన్డే మ్యాచ్ గెలిచింది.  ఇక ఇటీవలే నిన్న జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్లో శ్రీలంక జట్టు ఎలా రాణిస్తుందో అని అందరూ అనుకున్నారు. కానీ లంక బౌలింగ్ విభాగం మొత్తం ఎంతో సమన్వయంతో సమిష్టిగా పోరాడింది. దీంతో భారత బ్యాట్స్మెన్లను తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో విజయం సాధించింది. దీంతో ఇక 19 ఓవర్లలో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది శ్రీలంక జట్టు. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1 తో సమానంగా ఉంది.



 ఈ క్రమంలోనే నేడు జరగబోయే మ్యాచ్ కీలక మ్యాచ్ గా మారింది. ఇక నేడు జరిగే మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తే వారే టీ20 సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం రెండవ టి20 మ్యాచ్లో విజయంతో దూకుడు మీద ఉంది శ్రీలంక జట్టు. మరోవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా కీలక ఆటగాళ్లను దూరం చేసుకుంది భారత జట్టు. ఈ క్రమంలోనే ఎంతోమంది అనుభవం లేని కొత్త ఆటగాళ్లు జట్టులో స్థానం సంపాదించుకున్నారు.  మరి ఈరోజు ఎవరు విజయం సాధిస్తారు ఎవరో పైచేయి సాధించి సిరీస్ కైవసం చేసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: