టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు దూసుకుపోతున్నారు. వరుసగా ఆరో రోజు కూడా తమ విజయపరంపరను కొనసాగిస్తున్నారు భారత క్రీడాకారులు. ఇవాళ ఉదయం జరిగిన ఫ్రీ క్వార్టర్స్ లో భారత షట్లర్ పీవీ సింధు విజయకేతనం ఎగురవేసింది. డెన్మార్క్ షట్లర్ బ్లిక్ ఫెల్ట్  తో జరిగిన ఫ్రీ క్వార్టర్స్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది పి.వి.సింధు. 21-15, 21-13 తో బ్లిక్ ఫెల్ట్ పై విజయకేతనం ఎగురవేసింది. ఇప్పటివరకూ బ్లిక్ ఫెల్ట్ తో... ఐదుసార్లు తలపడగా.... నాలుగు సార్లు పి వి సింధునే విజయం సాధించింది. 

పీవీ సింధు ఫ్రీ క్వార్టర్స్ లో మంచి విజయం సాధించగా... అటు ఆర్చర్ దాస్ మంచి ఆట ప్రదర్శన కనబరిచాడు. ఇవాళ దక్షిణ కొరియా ఆర్చర్ పై అతాను దాస్... గెలిచి ఫ్రీ క్వార్టర్స్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఎలిమినేషన్ రౌండ్ లో దక్షిణ కొరియా ఆర్చర్...జిన్ హెక్ పై 6-5 తేడాతో దాస్ విజయం కేతనం ఎగుర వేశాడు. ఇక అటు భారత హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో దూసుకుపోతోంది.

పూల్- ఏ నాలుగో మ్యాచ్ లో అర్జెంటీనా పై గెలుపు ఎగురవేసింది భారత హాకీ జట్టు. ఇవాళ అ జరిగిన నాలుగో క్వార్టర్స్ లో లో రెండు గోల్స్ చేసింది ఇండియా. అలాగే బారత హాకీ సభ్యుడు హర్మన్ ప్రీత్ సింగ్ మూడో గోల్  చేయడంతో....3-1 తేడాతో అర్జెంటీనా హాకీ జట్టుపై అద్భుత విజయం సాధించింది భారత హాకీ జట్టు. ఇక అటు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు... ఎంసి మేరీకోమ్ కొలంబియా దేశానికి చెందిన ఇంగ్రిట్ లోరెనా వాలెన్సియా తో తల పడనున్నది. ఇక ఇప్పటికే మేరీకోమ్ బాక్సింగ్ లో తన అత్యున్నత ప్రదర్శన ను కొనసాగిస్తున్నది. ఇవాళ మ్యాచ్ గెలిస్తే రికార్డు లోకి ఎక్కనుంది మేరీకోమ్.

మరింత సమాచారం తెలుసుకోండి: